Hansika on Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్లకు సరైన ప్రాపర్ హిట్ సినిమా పడినా కూడా అవకాశాలు రాకుండా పోతాయి. అలానే ఒక డిజాస్టర్ సినిమా పడినా కూడా వరుసగా అవకాశాలు వచ్చిన దాఖలాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా మంది హీరోయిన్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్లకి మంచి హిట్ సినిమాలు కూడా ఇచ్చారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత నేహా ఒక్క హిట్ సినిమా కూడా పొందుకోలేకపోయింది. అలానే దేశముదురు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే దేశముదురు అని చెప్పాలి.
హన్సిక ఎన్ని సినిమాలు చేసినా కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అంటే దేశముదురు అని ఖచ్చితంగా చెబుతారు. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవటం వల్ల హన్సిక కనుమరుగైపోయింది. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. ఇక రీసెంట్ గా హన్సిక చేసిన సినిమా సినిమా మై నేమ్ ఇస్ శృతి. ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శక వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొద్దిపాటి పాజిటివ్ టాక్ సాధించింది. ఇక ప్రస్తుతం కేవలం సినిమాలు మాత్రమే చేయకుండా రియాలిటీ షోలో జడ్జిగా కూడా పనిచేస్తుంది హన్సిక. హన్సిక రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also read : Emergency OTT release : ‘ఎమర్జెన్సీ’ ఓటీటీ రిలీజ్ డేట్… కంగనా కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హన్సిక మాట్లాడుతూ నా ఫస్ట్ హీరో అల్లు అర్జున్. నేను ఆయనతో పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తాను. తను వెరీ స్వీట్, నాకు తెలుగులో మొదటి హిట్. తను నేను అదృష్టంగా ఫీల్ అవుతా. ఆయనకి నేషనల్ అవార్డు రావడం అనేది 100% కరెక్ట్. వెరీ వెల్ డిసర్వ్డ్. దేశముదురు సినిమా చేసినప్పుడు అల్లు అర్జున్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆయన చాలా హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన్నుంచి నేను నేర్చుకున్నది ఏమైనా ఉంది అని అంటే హంబుల్ గా ఉండటం. అంతేకాకుండా ఆయన డాన్స్ మూవ్మెంట్స్ కూడా. ఆయన హార్డ్ వర్క్, ఆయన ప్యాసన్ నెక్స్ట్ లెవెల్. అంటూ అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హన్సిక. ప్రస్తుతం హన్సిక పలు రకాల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా చాలా రియాల్టీ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Also Read : Surekha – Supritha: బీచ్‌లో బికినీతో తల్లీకూతుళ్లు రచ్చ.. ఆసక్తి రేపుతోన్న కొటేషన్..!