Akhanda 2: బాలకృష్ణ (Balakrishna)ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో బాలయ్య తన తోటి హీరోలకు కాకుండా ,యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వందకోట్ల కలెక్షన్లను రాబడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
పుట్టినరోజు వేడుకలు…
ఇక ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడం విశేషం. త్వరలోనే బాలకృష్ణ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో నటిస్తున్న ఆఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ లేదా దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో ఈయన బసవతారకం హాస్పిటల్ లో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
గడ్డకట్టే చలి…
ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. ఈ సందర్భంగా ఆఖండ సినిమా విశేషాలను కూడా అందరితో పంచుకున్నారు. అఖండ సినిమా షూటింగ్ ఇటీవల జార్జియాలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఈ తాండవం సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో మైనస్ 4 డిగ్రీల చలి ఉందని, అంత చలిలో ప్రతి ఒక్కరు కూడా వనికి పోతున్నారని బాలకృష్ణ తెలియజేశారు. ఇక ఆ సమయంలో నేను షూటింగ్లో పాల్గొంటే పెద్దగా స్వెటర్లు, డ్రెస్సులు వేసుకునే అవకాశం కూడా లేదని తెలిపారు.
అంత శివయ్య లీల..
తాండవం షూటింగ్ కోసం నేను మేకప్ వేసుకొని ఒంటి పై పెద్దగా బట్టలు లేకుండా ఆ లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని అంత చలిలో అలాగే నిలబడిపోయాను. అందరూ కూడా చలికి వణుకుతూ పరుగులు పెడుతున్నారు. నన్ను చూసి ఆ పిచ్చోడు ఏంటి అలా నిలబడినాడు, బండరాయిలాగా అక్కడే ఉన్నాడు అంటూ అందరూ మాట్లాడారు. అయితే నేను అలాగే ఆ సన్నివేశాలను పూర్తి చేశాను అంటే అంతా ఆ శివయ్య లీలే అని, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగా శివుడి ఆజ్ఞతోనే తాను అంత చలిలో కూడా ఆ సన్నివేశాలను పూర్తి చేసాము అంటూ బాలకృష్ణ అఖండ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ చూస్తుంటే మాత్రం ఈసారి థియేటర్లలో స్పీకర్లు బద్దలవ్వటం ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.