OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిలో మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడడానికే ఎక్కువగా ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈరోజు మన మూవీ సజెషన్ కూడా మలయాళ క్రైమ్ థ్రిల్లరే. రీసెంట్ గా అసిఫ్ అలీ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్నాయి. అయితే ఈ హీరో నటించిన ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక ఆభరణాల దుకాణంలో సుమారు ఒకటిన్నర కిలోల బంగారాన్ని దొంగలు దొంగలిస్తారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాజన్ ఫిలిప్ (అసిఫ్ అలీ) ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మెదలు పెడతాడు. అతనితో పాటు సీనియర్ అధికారి బషీర్, రాజేష్, అబిన్, రాజీవన్ వంటి వాళ్ళు ఒక బృందంగా ఏర్పడి, దొంగని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే దొంగతనం జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడంతో, ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది.
ప్రాథమిక దర్యాప్తులో, దుకాణ యజమాని కొడుకు అనుమానం ఉందని చెప్పడంతో, అరవిందన్ అనే వ్యక్తిని అనుమానిస్తారు. అరవిందన్ తన ప్రేమికురాలి కుటుంబాన్ని అప్పుల నుండి కాపాడడానికి, ఆభరణాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ తర్వాత ఆ ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి అరవింద్ తన ఆస్తిని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఈ కేసులో అరవిందన్ ప్రమేయం కూడా డౌట్ గానే ఉంటుంది.
మరోవైపు ఆ దొంగతనం జరిగిన ప్రాంతంలో కొంత దూరంలో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో, ఒక వాహనం అనుమానస్పదంగా కనిపిస్తుంది. దాని నంబర్ ప్లేట్ అసలు రికార్డ్ లోనే ఉండదు. ఈ వాహనం ఆధారంగా మళ్ళీ ఈ కేసు దర్యాప్తును ప్రారంభిస్తారు. ఈ కేసు, ఈ బృందాన్ని నార్త్ ఇండియాలోని ఒక గ్రామానికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన పోలీసులు ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కుంటారు. చివరికి ఈ దొంగతనం చేసింది ఎవరు అనేది కనిపెట్టారా ? పోలీసులు వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? పోలీసులు నార్త్ ఇండియాలో ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇది అమ్మాయా.. ఆడ పిశాచా మావా? రాత్రయితే చాలు దెయ్యంతో ఆ పాడు పనులేంటి?
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కుట్టవుం శిక్షయుం’ (Kuttavum Shikshayum). 2022 లో విడుదలైన ఈ మూవీకి రాజీవ్ రవి దర్శకత్వం వహించారు. ఇందులో అసిఫ్ అలీ, సన్నీ వేన్, అలెన్సియర్ లే లోపెజ్, షరఫ్ ఉద్దీన్, సెంథిల్ కృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ 2015లో కాసరగోడ్‌లో జరిగిన నిజమైన దొంగతనం ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ 2022 మే 27న థియేటర్లలో విడుదలైంది. 2022 జూన్ 26 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.