BigTV English

NBK109 Movie :  బాలయ్య తో డాన్స్ కి సై అంటున్న తమన్న..

NBK109 Movie :  బాలయ్య తో డాన్స్ కి సై అంటున్న తమన్న..
NBK109 Movie

NBK109 Movie : ఆరుపదుల వయసులో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ. బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ ,వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలకృష్ణ ఆక్సాఫీస్ ని తన సినిమాలతో బంతాట ఆడేశాడు. కుర్ర హీరోలకు సైతం సవాలు విసిరే విధంగా కలెక్షన్స్ రాబట్టిన బాలయ్య సినిమాలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. దీంతో బాలయ్య నెక్స్ట్ మూవీస్ పై ఆసక్తి బాగా పెరిగింది.


ప్రస్తుతం బాలయ్య చేస్తున్న NBK109 మూవీ పై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. వాల్తేరు వీరయ్య మూవీ రూపంలో చిరంజీవికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ బాబీతో కలిసి బాలయ్య తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. వాల్తేర్ వీరయ్యలు చిరంజీవికి బాబీ ఏ రేంజ్ మాస్ ఎలివేషన్ ఇచ్చాడు అందరికీ తెలుసు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చిరుకి సూపర్ డూపర్ హిట్ అందించాడు బాబీ. దీంతో ఇప్పుడు బాలయ్య ,బాబీ కాంబోలో వస్తున్న మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇక బాలయ్య చేస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న విషయం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2024 సమ్మర్ లో విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కావడంతో ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా షూటింగ్లో పాల్గొంటున్నారు. గుంటూరు కారంలో మహేష్ బాబు జోడిగా నటిస్తున్న మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంలో బాలయ్యతో యాక్ట్ చేస్తోంది. అయితే మూడో హీరోయిన్ ఎవరు అనే విషయంలో మాత్రం చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మూవీ టీం.


ఈ నేపథ్యంలో నాలుగవ హీరోయిన్ గా సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా కనిపించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క తమన్నా ఈ మూవీలో కేవలం ఐటమ్ సాంగ్ లో మాత్రమే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో తమన్నా ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. బాబీ తీసిన జై లవకుశ చిత్రంలో స్వింగ్ జరా సాంగ్ కు తమన్నా వేసిన స్టెప్స్ అందరినీ ఫిదా చేశాయి. అందుకే తిరిగి బాబీ మరోసారి తమన్నా సెంటిమెంట్ను ఈ మూవీకి కూడా వాడుతున్నట్లు టాక్. ఇక బాలయ్యతో తమన్నా మాస్ ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×