Kayadu Lohar: సోషల్ మీడియా.. ఎవరిని ఎప్పుడు హీరోను చేస్తుందో.. ఎవరిని జీరోను చేస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్స్. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. ఆమె నేషనల్ క్రష్. అది కేవలం మన భాషలో మాత్రమే కాదు.. వేరే భాషల్లో కూడా ఏ సినిమా హిట్ అవుతుందో.. ఆ సినిమా హీరోయిన్ ను సెన్సేషన్ గా మార్చేస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రేమలు సినిమా రిలీజ్ అయ్యాకా మమితా బైజును ఫేమస్ చేశారు. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపించిన ఈ భామ.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యి కూర్చోంది. ప్రేమలు సినిమా తరువాత ఎక్కడ చూసిన మమితానే కనిపించింది.
ఇక మమితా తరువాత బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని ఫేమస్ చేశారు. ఒక చిన్న వీడియోలో ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చూసి ఎవరీమె.. ఇంత అందంగా ఉంది అని సోషల్ మీడియా మొత్తం ఆమె వీడియోలను ఫేమస్ చేశారు.తెలుగులో ఒక సినిమా చేసినా కూడా పట్టించుకోని ప్రేక్షకులు.. ఆ వీడియోతో ఏంటీ.. ఈమె తెలుగు సినిమా చేసిందా అని ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఇంకో భామను సోషల్ మీడియా సెన్సేషన్ గా మార్చేశారు నెటిజన్స్. ఆమె కాయాదు లోహర్.
గత మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా కాయాదు పేరే వినిపిస్తుంది. అసలు ఎవరీమె.. ? ఎందుకు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అంటే.. ఈ మధ్యనే డ్రాగన్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. అందులో ఈ చిన్నదే హీరోయిన్. అప్పటివరకుఅమ్మడి పేరు కూడా తెలియని ప్రేక్షకులకు.. ఇప్పుడామె ఒక క్రష్. కాయాదు.. ఒక మలయాళ నటి. ఆమె కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూనే హీరోయిన్ గా మారింది. తెలుగులో కూడా కాయాదు ఒక సినిమా చేసింది. శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాలో అమ్మడే హీరోయిన్. ఆ సినిమా ఆశించిన ఫలితం అందించలేకపోవడంతో ఈ చిన్నదాని గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయింది. డ్రాగన్ సినిమాతో ఈ చిన్నది సెన్సేషన్ గా మారింది.
Govinda Divorce: గోవిందా విడాకులు.. క్లారిటీ ఇచ్చిన మేనకోడలు
అయితే డ్రాగన్.. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా రిలీజ్ అయ్యింది. లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు ప్రదీప్ రంగనాధన్. ఆ సినిమా తరువాత ప్రదీప్ హీరోగా నటించిన చిత్రమే డ్రాగన్. తమిళ్ లో మంచి విజయాన్ని అందుకున్నా.. తెలుగులో మాత్రం లవ్ టుడే అంత విజయాన్ని మాత్రం అందుకోలేదు. అయినా కూడా ఆ సినిమాలో నటించిన కాయాదు మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. అదేంటి.. అదెలా అనుకుంటే.. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారడానికి కాయాదు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వడం వలన అన్నమాట.
ఏంటీ.. కాయాదు ప్లాన్ చేసి ఇదంతా చేసిందా అంటే.. అవును. ఆమె గుట్టురట్టు చేసాడు ప్రదీప్. కాయాదు కావాలనే తనను తాను సెన్సేషనల్ హీరోయిన్ అని మీమ్ క్రియేట్ చేసుకొని.. మీమర్స్ కు పంపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది. దాన్ని ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకుంది. డ్రాగన్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కాయాదు, ప్రదీప్ ఫోన్ లు మార్చుకున్నారు. ఇక కాయాదు ఫోన్ లో మీమ్ క్రియేషన్ యాప్ ను ప్రదీప్ చూసి.. ఇదేంటి కొత్త యాప్ లా కనిపిస్తుంది అని ఓపెన్ చేస్తుంటే.. ఆమె వద్దు వద్దు అని వారించింది. అయినా కూడా ప్రదీప్ ఓపెన్ చేయగానే అందులో ఆమె ఫోటో దాని కింద ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు సినిమా అని రాసి ఒక మీమ్ క్రియేట్ చేసి ఉంది. ఆ మీమ్ ను ఆమె మీమర్స్ గ్రూప్ కు పంపినట్లు చెప్పాడు.
అంటే ఆమె తన ఫోటో తీసుకొని దానికింద ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు సినిమా అని తనకు తానె రాసుకొని.. దాన్ని మీమ్స్ ఛానెల్స్ కు పంపి.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేలా చేసింది అని చెప్పుకొచ్చాడు. దానికి కాయాదు అది పీఆర్ గేమ్ లో భాగం. మీరు నిజంగా సక్సెస్ అయ్యేవరకు ఇలాంటి ఫేక్ చేయాలి అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏంటి ఈ అమ్మాయి ఇంత ఫ్రాడ్ చేసి పైకి వచ్చిందా.. ? అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం ఆమె ఫ్రాడ్ చేసినా కూడా నిజాయితీగా చెప్పింది. కొందరు అది కూడా చేయడం లేదు అని చెప్పుకొస్తున్నారు. మరి కాయాదు పీఆర్ టీమ్ వలన తెలుగులో ఈ చిన్నది ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.
"Fake it till you make it"😁 pic.twitter.com/R9mGoI3uWY
— AmuthaBharathi (@CinemaWithAB) February 23, 2025