BigTV English

Mazaka Movie OTT: ‘మజాకా’ మూవీ ఓటీటీ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే.?

Mazaka Movie OTT: ‘మజాకా’ మూవీ ఓటీటీ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే.?

Mazaka Movie OTT: ఈరోజుల్లో సినిమాలు థియేటర్లలో విడుదల అవ్వకముందే వాటి ఓటీటీ రైట్స్‌ను భారీ ధరలకే కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఒకప్పుడు మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లలో అవి హిట్ అయ్యాయా, ఫ్లాప్ అయ్యాయా అని అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసేవారు. కానీ ఈరోజుల్లో సినిమాలు అసలు సెట్స్‌పైకి వెళ్లకుండానే మేకర్స్‌పై ఉన్న నమ్మకంతో వారిపై భారీ రేటు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్. తాజాగా విడుదలయిన ‘మజాకా’ విషయంలో కూడా అదే జరిగింది. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు అనే విషయం బయటికొచ్చింది.


ఓటీటీ పార్ట్‌నర్ ఎవరంటే.?

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రమే ‘మజాకా’. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సందీప్ కూడా ఇదే తన కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలుస్తుందని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే సినిమాలో కామెడీ బాగుందని, థియేటర్లలో దీనిని ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేసుకున్నా ఫిబ్రవరి 25 నుండే ‘మజాకా’ పెయిడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. అలా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది.


అప్పుడే ఓటీటీలోకి

‘మజాకా’ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 కొనుగోలు చేసిందట. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో విడుదలయిన ఏ మూవీ అయినా ఓటీటీలో విడుదల అవ్వడానికి కాస్త సమయం పడుతోంది. ఒకవేళ థియేటర్లలో మూవీకి మంచి టాక్ లభిస్తే.. ఓటీటీ రిలీజ్‌ను రెండు నెలల వరకు వాయిదా వేయడానికి కూడా మేకర్స్ సిద్ధంగా ఉంటున్నారు. అలా ‘మజాకా’ మూవీ థియేటర్లలో విడుదలయిన నాలుగు వారాల తర్వాత అంటే దాదాపు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విడుదలయితే దీని టాక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read: బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ ఇంత తక్కువా.? అయినా సందీప్‌కు సవాలే..

యాక్టివ్ ప్రమోషన్స్

‘మజాకా’ (Mazaka) కోసం మొదటిసారి సందీప్ కిషన్ (Sundeep Kishan), రీతూ వర్మ జోడీకట్టారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో సందీప్ ఎంత యాక్టివ్‌గా పాల్గొన్నాడో రీతూ వర్మ కూడా అంతే యాక్టివ్‌గా ప్రతీ ప్రమోషన్‌లో భాగమయ్యింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. ముఖ్యంగా ‘మజాకా’ ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్, రీతూ కలిసి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఫన్నీ రీల్స్‌తో, డ్యాన్స్‌లతో తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకుంది ఈ జంట. ఇక ఇందులో రావు రమేశ్ కూడా మరొక కీలక పాత్రలో నటించారు. ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు చాలా ఏళ్ల తర్వాత ‘మజాకా’తో మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వనుంది. తన రీఎంట్రీ గురించి ప్రస్తుతం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×