Govinda Divorce: నేటి ఉదయం నుంచి బాలీవుడ్ హీరో గోవిందా.. తన భార్య సునీతా అహుజాకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తమ 37 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక రూమర్స్ పై గోవిందా కానీ, సునీతా కానీ స్పందిస్తారేమో అనుకున్నారు కానీ.. గోవిందా మేనకోడలు స్పందించింది. గోవిందా విడాకుల వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ వార్తలను సృష్టించవద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది.
గోవిందా మేనకోడలు ఆర్తీ సింగ్ కూడా నటినే. తోడా హై బాస్ థోడేకి జరూరత్ హై, పరిచయ్, వారిస్ ధారావాహికల్లో నటించి మంచి గుర్తింపునందుకొని, 2019లో, ఆమె బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది. ఇక తాజాగా ఆమె తన మేనమామ విడాకుల గురించి మాట్లాడుతూ.. ” నిజాయితీగా చెప్పాలంటే నేను ప్రస్తుతం ముంబైలో లేను కాబట్టి నేను ఎవరినీ సంప్రదించలేదు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇవన్నీ తప్పుడు వార్తలు. వారి బంధం చాలా బలంగా ఉంది. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.
గోవిందా మరియు సునీత ఎన్నో సంవత్సరాలుగా బలమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి వారు ఎలా విడాకులు తీసుకుంటారు? ప్రజలు ఇలాంటి పుకార్లన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో నాకు తెలియదు. ప్రజలు.. మా వ్యక్తిగత జీవితాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలి. నిజానికి, నా విడాకుల గురించిన వార్తలు కూడా ఎటువంటి కారణం లేకుండానే బయటపడ్డాయి. ఇటువంటి ఆధారం లేని గాసిప్‌లు అనవసరమైన ఒత్తిడిని మాత్రమే సృష్టిస్తాయి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో గోవిందా విడాకుల్లో వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది.
Sankranthiki Vastunnam: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్
అసలు ఈ విడాకులు గొడవ ఎప్పుడు మొదలయ్యింది అంటే.. ఈ మధ్యనే గోవిందా భార్య సునీత అహుజా ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ” నేను, గోవిందా విడిగా ఉంటున్నాం. నేను , నా పిల్లలు ఒక చోట ఉంటున్నాం. ఆయన మా ఇంటి ఎదురు బంగ్లాలో ఉంటున్నారు. వచ్చే జన్మలో కనుక నాకు అవకాశం ఉంటే గోవిందాను పెళ్లి చేసుకోను. ఆయనతో కలిసి జీవించడం చాలా కష్టం. ఆయనెప్పుడు పని మీదనే ధ్యాస పెడతారు. జీవితం మొత్తం దానికే అంకితం చేశాడు.
ఆయనతో కలిసి తిరగాలనుకున్నా నా కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. రోడ్డు పక్కన గోవిందాతో కలిసి పానీపూరి తీనాలనుకున్నాను. అది జీవితంలో నెరవేరదు. మేమిద్దరం కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమా చూసింది లేదు” అని ఆమె చెప్పడంతో ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆ వార్తలు వలనే ఈ విడాకుల రూమర్స్ మరింత వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆర్తీ ఈ వ్యాఖ్యలను ఖండించడంతో గోవిందా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి త్వరలో గోవిందా కూడా ఇదే విషయాన్నీ అధికారికంగా చెప్తాడేమో చూడాలి.