Actor Krishnudu : సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటులు రెండు మూడు చిత్రాలతోనే భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచీ కనుమరుగవుతూ ఉంటారు. అయితే సంవత్సరాల తరబడి గ్యాప్ తీసుకొని, మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తే.. అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి వారిలో నటుడు కృష్ణుడు (Krishnudu)కూడా ఒకరు. ఈయన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు. గంగోత్రి చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హ్యాపీడేస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలు ఈయనకు బాగా కలిసి వచ్చాయి. ఇకపోతే ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న ఈయన ఇప్పుడు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు తనకు ఎలా అవకాశాలు వచ్చాయి అనే విషయాన్ని వెల్లడించారు.
అందుకే ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా..
ముందుగా ఏడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని కృష్ణుడు వెల్లడించారు. కృష్ణుడు మాట్లాడుతూ..” ఏ సినిమాలో చేసినా వినాయకుడు అని మాత్రమే పిలుస్తున్నారు. అసలు ఛాలెంజింగ్ రోల్స్ ఏవి నా వద్దకు రావట్లేదు. రొటీన్ గా ఒకే తరహా పాత్రలు చేసి విసుగు వచ్చింది. దీనికి తోడు ఫోటోగ్రఫీ కి వెళ్తే అక్కడ కూడా పెద్దగా ఏవీ నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు కనిపించలేదు. దాంతో నా దగ్గర ఉన్న మేనేజర్ ని కూడా తీసేసి ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాను. నచ్చిన పని చేస్తూ.. విహారయాత్రలకు వెళ్తూ.. జీవితాన్ని గడిపేసాను. 160 కేజీల బరువు ఉండేసరికి అదే తరహా పాత్రలు ఇస్తున్నారు. దీంతో ఎవరో డబ్బులు ఇస్తున్నారు.. ఏదో వెళ్లి పాత్ర చేస్తున్నాము అనే విషయాలు నాకు నచ్చలేదు. దీనికి తోడు పాప పుట్టడం పాపతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడం వల్ల కూడా నేను ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన చేయలేదు. అందుకే ఇండస్ట్రీకి కూడా దూరమయ్యాను అంటూ తెలిపారు.
అదృష్టం ఉంటే అవకాశాలు అవే వస్తాయి..
ఇకపోతే వరుస పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు.. ఎలా సాధ్యం? అని ప్రశ్నించగా.. మనకి ఏ పాత్ర రాసి ఉంటుందో..? ఏ రోజు సినిమాల్లోకి రావాలని ఉంటుందో..? అప్పుడే అన్ని జరుగుతాయి. నేను ఏ రోజు కూడా సినిమాల్లో అవకాశాల కోసం సంప్రదించలేదు. అలాగని ప్రయత్నించనూ లేదు. వారికి ఈ పాత్రలో కృష్ణుడు సరిపోతారు అని అనుకొని, వారే పిలవడం వల్లే ఇప్పుడు మళ్లీ నేను రీఎంట్రీ ఇవ్వగలిగాను అంటూ తెలిపారు కృష్ణుడు. ప్రస్తుతం 160 కేజీల నుంచి 109 కేజీలకు వచ్చిన ఈయన శంకర్ (Shankar ), రామ్ చరణ్ (Ram Charan ) కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. మొత్తానికి అయితే అదృష్టం ఉంటే అదే తలుపు తడుతుంది అని మరోసారి నిరూపించారు కృష్ణుడు.