Ex Sarpanchs: గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సర్పుంచులు రోడ్డు పాలయ్యారని పంచాయితీ రాజ్ చాంబర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు వసూలు చేయాలని నేడు సర్పంచులు హైదరాబాద్ లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… గతంలో ఎప్పుడూ సర్పంచులకు పెండింగ్ బిల్లులు లేవని అన్నారు. ఈ ఖర్మ రావడానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమని చెప్పారు. గ్రామ పంచాయితీకి, మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు విడివిడిగా డబ్బులు జమ అయ్యేవని అన్నారు.
Also read: ఢిల్లీ పర్యటనలో పవన్… అమిత్ షాతో భేటీ.. వీటిపైనే చర్చ!
తెలంగాణ వచ్చిన తరవాత బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా పంచాయితీ రాజ్ చట్టం తీసుకుని వచ్చి నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోనే వేసుకున్నారని చెప్పారు. కొత్త రాష్ట్రం వస్తే గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందుతాయని భావించామని కానీ కొత్త పంచాయితీ రాజ్ చట్టంతో ఆగమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 5వేల మండి వార్డు మెంబర్లు, 195 మంది సర్పంచులు చనిపోతే కేసీఆర్ 5 ఏళ్లలో కనీసం ఎన్నికలు కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలతో ఎన్నుకున్న ప్రభుత్యాలే అనుకుంటున్నారని స్థానిక ప్రభుత్వాలను ఆ విధంగా భావించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడు స్థానిక సంస్థలను చంపేసిన బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. సర్పంచులు ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు రమ్మన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావును ఎవరు పిలిచారని మండిపడ్డారు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏం చేశారని నిలదీశారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సర్పంచ్ లు బిల్లులు రావడంలేదన అనేకసార్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలమే అవుతుండటంతో బీఆర్ఎస్ పైనే సర్పంచులు తిరగబడుతున్నారు. ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యను అర్థం చేసుకుని పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.