Mahesh Babu : ఒక కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరూ కష్టపడితేనే ఆ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు అందుకుంటుంది. ముఖ్యంగా ఒక ఇంటి కోసం భార్య ఎంత అయితే శ్రమ పడుతుందో.. భర్త కూడా అంతకంటే ఎక్కువ పోరాడతారు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే మగవారి కష్టాన్ని గుర్తించి నవంబర్ 19వ తేదీని పురుషుల కోసం అంకితం చేశారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్నేషనల్ మెన్స్ డే ని పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.
నిజమైన మగాడు వాడే…
మహేష్ బాబు ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’ సందర్భంగా మగవారి గొప్పతనంపై ఒక వాయిస్ నోట్ విడుదల చేయడం జరిగింది. అందులో ఏముంది అనే విషయానికొస్తే.. ‘ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో, ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో, ఎవరి మనసు మెత్తగా ఉంటుందో, ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో, ఎవరు మగువ అంటే మనిషి అని మరిచిపోరో, స్త్రీకి కూడా గౌరవం లభించాలని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో, వారే నిజమైన మగాడు అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఎంతైనా సూపర్ స్టార్ మహేష్ బాబు మరొకసారి తనను తాను నిరూపించుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు కెరియర్…
దివంగత దిగ్గజ నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. బాల నటుడిగా 8 కి పైగా చిత్రాలలో నటించిన మహేష్ బాబు.. హీరోగా ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి, తన నటనతో ఉత్తమ నూతన నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ‘నిజం’ సినిమాకు కూడా నంది అవార్డు అందుకున్నారు మహేష్ బాబు. 2005లో వచ్చిన ‘అతడు’, 2011లో వచ్చిన ‘దూకుడు’, 2015 లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రాలకి కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకోవడం జరిగింది.
రాజమౌళి దర్శకత్వంలో మూవీ..
1979లో నీడ అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన..ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తన 29వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు మహేష్ బాబు. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ అడవులలో సాగే అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా లొకేషన్స్ కోసం విదేశాలలో వేట మొదలుపెట్టారు రాజమౌళి. ఇక సరైన లొకేషన్ సినిమా తగ్గట్టుగా దొరికితే వెంటనే సినిమా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Respect, empathy, and strength of character are the real traits of a man. He who stands for equality, and brings kindness into his every action is a #RealMard. This #InternationalMensDay, join me in my commitment with @MardOfficial to redefine #ModernMasculinity…
— Mahesh Babu (@urstrulyMahesh) November 19, 2024