Kandula Durgesh vs Bosta: రుషికొండ ప్యాలెస్ వ్యవహారంపై వైసీపీ డిఫెన్సులో పడిపోయింది. మంత్రుల నుంచి ఎదురుదాడి మొదలుకావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చివరకు వాటిని వైసీపీ ప్రభుత్వ భవనాలుగా తేల్చేసింది. ప్రభుత్వం మీది.. ఏం చెయ్యాలో చేసుకోండంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.
రుషికొండ ప్యాలెస్ అంశంపై మండలిలో ఎమ్మెల్సీ రామారావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. అక్కడ హరిత రిసార్ట్స్ వల్ల ఏడాదికి 7 కోట్లు నుంచి 16 కొట్ల వరకు ఆదాయం వచ్చేదన్నారు.
58 గదులతో అద్భుతమైన హరిత రిసార్ట్స్ ఉండేదన్నారు. వాటిని పడగొట్టి ప్యాలెస్‌ను కట్టారన్నారు. దీనివల్ల రుషికొండకు అపారమైన నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఈ తరహా బీచ్ ఎక్కడా లేదన్నారు. ప్యాలెస్ కట్టి దాన్ని ఏడు బ్లాకులు విభజించారన్నారు.
తొలుత అప్లికేషన్ పెట్టినప్పుడు బెటర్ రిసార్ట్స్ చేస్తామని చెప్పి, ఏడాది కిందట ముఖ్యమంత్రి నివాసమంటూ మాట్లాడారని దుయ్యబట్టారు సదరు మంత్రి. ఇందుకోసం 481 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లోపల ఇంద్రభవనం మాదిరిగా ఉందన్నారు. బెటర్ రిసార్ట్స్ అన్నప్పుడు, నిర్మాణం సమయంలో మిగతావారిని ఎందుకు అనుమతించలేదని ఎదురుదాడి మొదలుపెట్టారు.
ALSO READ: మండలిలో మదనపల్లె ఫైల్స్‌పై మంటలు.. పేరు వెల్లడిపై గందరగోళం
జీవోలన్నీ ఒక్కసారి పరిశీలించాలని ఛైర్మన్‌కు వివరించారు మంత్రి దుర్గేష్. అన్నింటినీ మీ దగ్గర పెడతామన్నారు. దీనిపై తేల్చాలని మంత్రి డిమాండ్ చేశారు. ఓపెన్ డిబేట్‌కు మేం సిద్దమేనని సవాల్ విసిరారు మంత్రి. ఎక్కువ ఏరియాను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలో నివేదిక వస్తుందన్నారు.
ఈలోగా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. 26000 ఎస్ఎఫ్‌టీలో ప్యాలెస్‌ను నిర్మించారన్నారు. అక్కడ ఖర్చు చేసిన నిధులతో 2,600 మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చన్నారు. ప్యాలెస్ చూస్తే గుండె ఆగిపోతుందన్నారు. మీరు వస్తామంటే బస్సు వేసి ముమ్మిల్ని తీసుకెళ్లి చూపిస్తామన్నారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి, ఎదురుదాడి చేస్తారా అంటూ మండిపడ్డారు మంత్రి.
వెంటనే ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల కోసం కట్టామన్నారు. అందులో ముఖ్యమంత్రి లేదా ప్రధాని ఎవరైనా ఉండొచ్చనని అన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్యాలెస్‌ను పరిశీలించారన్నారు. అది ప్రభుత్వ భవనమని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని అన్నారు. ఏం చేస్తారో చేయ్యాలంటూ తన ప్రసంగాన్ని విపక్ష నేత బొత్స ముగించారు.
రుషికొండపై ఉన్న హరితా రిసార్ట్స్ ని
సంవత్సరానికి 7 కోట్లు నుంచి 16 కొట్లవరకు ఆదాయం ఇచ్చిన రిసార్ట్స్ ను కూల్చేసిన ఘనత వైసీపీది~పర్యాటక మంత్రి @kanduladurgesh 🔥💥👌@PawanKalyan @ncbn pic.twitter.com/2GL6YCMsPP— ఉత్తరాంధ్ర జనసైన్యం (@UA_Janasainyam) November 19, 2024