MAD Square Trailer :ఈ మధ్యకాలంలో యువతను టార్గెట్ గా చేసుకొని ప్రేక్షకులను మెప్పించడానికి అటు యంగ్ హీరోలు కూడా కామెడీ జానర్ ను నమ్ముకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2023లో యంగ్ హీరో నార్నే నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) హీరోలుగా విడుదలైన చిత్రం మ్యాడ్ .2023 అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అటు కామెడీ పరంగా.. ఇటు ఆడియన్స్ ను కూడా బాగా మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ అంటూ మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను సూర్యదేవర హారిక (Surya Devara Harika), సాయి సౌజన్య (Sai Soujanya) సంయుక్తంగా నిర్మించారు.
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ రిలీజ్..
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ పెంచడానికి.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేయగా లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. అటు నటీనటుల సంభాషణ, కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. మొత్తానికైతే మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చిన ఈ ముగ్గురు ఈ సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటారని నెటిజన్స్ కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఏం మారలేదు.. అదే చిల్లర కామెడీ.. ఇంతకీ గోవాలో ఏం చేశారో అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికి అయితే ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన వీరు.. ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
మ్యాడ్ తో ఆకట్టుకున్న టీమ్..
మ్యాడ్ సినిమా విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇందులో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా స్టోరీ విషయానికి చూస్తే.. ఈ ముగ్గురు హీరోలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవుతారు. ఈ ముగ్గురు లైఫ్ లోకి జెన్నీ, శృతి, రాధ వస్తారు.. ఈ ముగ్గురు అమ్మాయిల వల్ల ఈ ముగ్గురు హీరోల జీవితాలు ఎలా మారిపోయాయి? ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కి మ్యాడ్ అనే పేరు ఎందుకు వచ్చింది? సీనియర్స్ తో పాటు మరో కాలేజీతో ఈ ముగ్గురికి ఎలాంటి గొడవలు వచ్చాయి ? అనేదే మిగిలిన కథ . మొత్తానికైతే ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా కథకి కొనసాగింపుగానే ఈ మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
VT 15: భయపెట్టడానికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్.. ఇండో కొరియన్ అంటూ..!