E-Paper
Advertisement

Supreme Court Delhi Apollo Hospital: ఉచితంగా భూమి తీసుకొని పేదలకు వైద్యం అందించరా?.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిపై సుప్రీం ఆగ్రహం

Supreme Court Delhi Apollo Hospital: ఉచితంగా భూమి తీసుకొని పేదలకు వైద్యం అందించరా?.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిపై సుప్రీం ఆగ్రహం
Advertisement

Supreme Court Delhi Apollo Hospital| సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదిరిన లీజు ఒప్పందం ప్రకారం.. హాస్పిటల్ లోని ఇన్-పేషెంట్ రోగుల్లో 33 శాతం మందికి, ఔట్-పేషెంట్ రోగుల్లో 40 శాతం మందికి ఉచిత చికిత్స అందించాల్సి ఉంది. ఈ బాధ్యత నిర్వహించకపోతే.. అపోలో హాస్పిటల్‌ని ప్రభుత్వ ఆస్పత్రి ఎయిమ్స్ (AIIMS)కు అప్పగిస్తామని తీవ్రంగా హెచ్చరించింది.

“ప్రభుత్వంతో కుదరిన లీజు ఒప్పందం ప్రకారం.. ఆసుపత్రికి వచ్చే రోగుల్లో (ఇన్ పేషెంట్) మూడింట ఒక వంతు మందికి, ఔట్‌పేషెంట్ రోగుల్లో 40 శాతం మందికి ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు ఉంది. ఒప్పందం ప్రకారం.. పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోతే, ఆసుపత్రిని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు అప్పగించాల్సి ఉంటుంది.” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది.

Advertisement

అపోలో సంస్థ.. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 15 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి నామమాత్రపు లీజుకు తీసుకుని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో కొంత శాతం వైద్యం పేదలకు ఉచితంగా అందించాల్సి ఉన్నా.. దానిని ఉల్లంఘిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఆసుపత్రిని లాభ, నష్ట రహిత విధానంలో నడిపించాల్సిన అవసరం ఉండగా.. దానిని పూర్తిగా వ్యాపార సంస్థగా మార్చినట్లు న్యాయస్థానం ఆరోపించింది. అక్కడ పేదలు వైద్యం పొందలేని విధంగా ధరలు పెరిగాయని ఆక్షేపించింది.

Also Read:  బిజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు.. దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు ప్రధాని మోదీ కానుకలు

Advertisement

ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంసీఎల్) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ ఆసుపత్రిలో ఢిల్లీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉన్నట్లు.. దానికి 26 శాతం వాటా ఉందని వెల్లడించారు. ఆదాయంలో ప్రభుత్వం కూడా వాటా తీసుకుంటోందని పేర్కొన్నారు. దీనిపై ‘‘పేద రోగులకు సంరక్షణ ఇవ్వకుండా, ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పొందడం చాలా దురదృష్టకరమని’’ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.

అయితే.. ప్రభుత్వంతో చేసిన 30 సంవత్సరాల లీజు ఒప్పందం 2023లో ముగిసింది. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలా లేదా అన్న అంశాన్ని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో.. ఒప్పందాన్ని పొడిగించకపోతే, భూమి పైన తీసుకోవాల్సిన చట్టబద్ధమైన చర్యలను వివరించాలన్నారు.

ఈ కేసులో.. ఐఎంసీఎల్ ఈ విషయంపై అఫిడవిట్‌ దాఖలు చేయవచ్చని.. ఆసుపత్రిలో గత ఐదేళ్లలో పేదలకు ఎన్ని ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ వైద్య సేవలు అందించారో దానిపై సమాచారం అందించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అంతకుముందు ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హై కోర్టులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే హై కోర్టు కూడా ఆస్పత్రికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అపోలో హాస్పిటల్‌కు హైకోర్టు ఇచ్చిన 70 పేజీల తీర్పులో పేద రోగులకు ఉచిత వైద్యం అందించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు తీర్పుని ఐఎంసీఎల్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×