Manchu Viranika Reddy:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఎప్పుడూ మీడియా ముందు కనిపిస్తారు. కానీ ఈ కుటుంబ కోడళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. అయితే తొలిసారి మంచు విష్ణు (Manchu Vishnu) సతీమణి మంచు ఫ్యామిలీ పెద్ద కోడలు అయినటువంటి విరానికా రెడ్డి (Viranika Reddy) తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో కూడా పంచుకుంది.
కన్నప్ప ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న మంచు విష్ణు..
ప్రస్తుతం మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయన.. అందులో భాగంగానే ఆయన భార్య విరానికా కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో ఈమె జీవనశైలి, పిల్లలు, భర్త విష్ణు గురించి కొన్ని విషయాలు పంచుకోవడమే కాకుండా మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడింది.
కుటుంబ గొడవలపై స్పందించిన విరానికా రెడ్డి..
మంచు ఫ్యామిలీలో గొడవలపై ఆమె మాట్లాడుతూ..’ ప్రతి కుటుంబంలో కూడా గొడవలు ,సమస్యలు ఉంటాయి. ఇక మా కుటుంబంలో కూడా ఇలాంటి గొడవలు వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి సమస్యలు రావడం మాకు బాధగా ఉంది. నిజానికి మా గురించి అందరికీ తెలుసు. ఈ గొడవలు మా కుటుంబం పై ప్రభావాన్ని చూపించాయి. అయితే ఈ గొడవల వల్ల ఆందోళన పడేది పిల్లల గురించి. ఇలాంటి విషయాలే పిల్లలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కుటుంబంలోని సోదరుల మధ్య జరుగుతున్న తగాదాలను చూసి పిల్లలు భయపడుతున్నారు. ఏం జరుగుతుందో అని కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇది పిల్లల సహజ స్వభావాలు కదా.. పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే తెలివిగా వ్యవహరించాలి. నాకు నా పిల్లలే ముఖ్యం. ఆ ప్రభావం వారిపై పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకే నేను తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా నా పిల్లలు కుటుంబ గొడవల పట్ల ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను” అంటూ విరానికా రెడ్డి చెప్పుకొచ్చింది. ఇకపోతే సాధారణంగా ఇంటర్వ్యూలలో కుటుంబ విషయాల గురించి మాట్లాడడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించరు. పైగా అంగీకరించారు కూడా.. ముఖ్యంగా మంచు విష్ణు అయితే అసలు ఒక్క మాట కూడా కుటుంబం గురించి మాట్లాడరు. కానీ విరానికా మాత్రం చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అటు ఆడియన్స్ కి సమాధానం చెబుతూనే.. ఇటూ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుతూ పిల్లలపై తన మమకారాన్ని చూపించింది. మొత్తానికైతే మంచు ఫ్యామిలీ పెద్ద కోడలు చాలా తెలివైనదే అంటూ అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మంచు కుటుంబంలో గొడవలు.. అందులోనూ రోడ్డుపైకి రావడంతో అభిమానులు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.