Uday Kiran: చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు ఉదయ్ కిరణ్(Uday Kiran). ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా అవకాశాలను అందుకున్న ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో ఒకసారిగా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరు మారుమోగిపోయింది. సినిమాలు చేయటం కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
అతడు సినిమా కోసం ఉదయ్ కిరణ్..
ఇలా ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఉదయ్ కిరణ్ నటన ఆయన ప్రతిభా శైలి చూసి తన ఇంటి అల్లుడిని చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె సుస్మితను ఉదయ్ కిరణ్ కు ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిపించారు. అయితే నిశ్చితార్థమైన కొద్ది రోజులకే పలు కారణాలవల్ల వీరిద్దరూ తమ నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పుకొని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈయన పెళ్లి క్యాన్సిల్ కావడంతో వచ్చిన అవకాశాలన్నీ కూడా క్రమక్రమంగా వెళ్లిపోయాయి.
చిరంజీవి కూతురుతో పెళ్లి ప్రకటన…
ఇక ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ లో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఇక వరుస ఫ్లాప్ సినిమాలను మూట కట్టుకున్న ఉదయ్ కిరణ్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి జరిగిన కొంతకాలానికే ఈయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణం ఏంటనేది తెలియడం లేదు. ఇదిలా ఉండగా సీనియర్ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ వివాహంలో మురళీమోహన్ వెళ్లి ఆయనని హగ్ చేసుకుని ఉన్నటువంటి ఒక ఫోటోని చూపించారు.
ఒక మనిషి డైరీ కంట్రోల్ చేయడమంటే ఎంత పెద్ద క్రైమ్ రా 🤮🤮
Worst to the core @KChiruTweets #megamafiapic.twitter.com/rw60eMgmhT
— Bala Chowdary (@padmabhushanNBK) June 2, 2025
ఈ ఫోటో చూసిన మురళీమోహన్ ఉదయ్ కిరణ్ చాలా మంచి నటుడు మొదటి సినిమా చూడగానే గొప్పవాడు అవుతారని అనుకున్నాను అయితే మహేష్ బాబుతో మేము చేసిన అతడు సినిమాకు మొదట ఉదయ్ కిరణ్ ని ఎంపిక చేసాం. ఆ సమయంలోనే చిరంజీవి గారి కూతురితో పెళ్లి అని ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన రావడంతోనే ఉదయ్ కిరణ్ కు అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఉదయ్ కిరణ్ డేట్స్ కి సంబంధించిన డైరీని మేము చూసుకుంటాము అంటూ వారు డైరీ తీసుకోవడం జరిగింది. ఇక సినిమా చేస్తాము అనే సమయానికి అప్పుడు ఏదో కన్ఫ్యూజన్ లో డేట్స్ ఉన్నాయని చెప్పాము ఇప్పుడు డేట్స్ లేవని చెప్పడంతో మహేష్ బాబుని అప్రోచ్ అయ్యామని మురళీమోహన్ ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగాల్సిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాతరంగా ఆగిపోవడం అనేది ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేని విషయమని చెప్పాలి.