ఈ రోజుల్లో ప్రజలకు కామన్ గా వచ్చే వ్యాధుల్లో ఒకటి కిడ్నీ ప్రాబ్లమ్. కిడ్నీల్లో రాళ్లు రావడం, కిడ్నీలు చెడిపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయో? లేదో? తెలుసుకోవడం సాధ్యమేనా అంటే? యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ సాధ్యమే అంటున్నారు. చిన్న చిట్కా ద్వారా మీ కిడ్నీ ఆరోగ్యం గురించి ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. ఎటువంటి RFT పరీక్ష, మూత్రపిండాల పనితీరు పరీక్ష లేకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని తనిఖీ చే యడానికి టిప్ ను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?
కిడ్నీలు సరిగా పని చేస్తున్నాయో? లేదో ఎలా తెలుసుకోవాలి?
డాక్టర్ పర్వేజ్ ప్రకారం.. మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మూత్ర విసర్జన ద్వారా తెలుసుకోవచ్చు. “సాధారణంగా, ఒక వ్యక్తి మూత్ర విసర్జన గంటకు కిలోకు 0.5 నుంచి 1 మి.లీ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు, 50 కిలోల బరువున్న వ్యక్తికి సుమారు 50 ml మూత్ర విసర్జన చేయాలి. దీని అర్థం వారి కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం.
మీ మూత్ర విసర్జనను ఎలా చెక్ చేయాలి?
మూత్ర విసర్జన అనేది సుమారు 10 గంటల పాటు లెక్కించాలని చెప్పారు. అప్పుడు 50 కిలోల బరువున్న వ్యక్తి సుమారు 500 ml మూత్రం ఉత్పత్తి అవుతుందన్నారు. “మీరు ఒక లీటరు బిస్లరీ బాటిల్ తీసుకొని దానికి అనుగుణంగా లెక్కించవచ్చు. మీ మూత్ర విసర్జన తగినంతగా ఉంటే, మీ మూత్రపిండాలు పూర్తిగా బాగున్నాయని అర్థం. కాబట్టి, ఎలాంటి టెస్టులకు వెళ్లకుండా మూత్ర విసర్జనను కొలవడం ద్వారా మీ మూత్ర పిండాలు ఎంత బాగా పని చేస్తున్నయో తెలుసుకునే అవకాశం ఉంది. ఖర్చు లేకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని గుర్తించే అవకాశం ఉంది” అన్నారు.
Read Also: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఎగిరి వంతెనను పట్టుకుని.. ఏం జంప్ చేశావ్ గురూ!
ఎలాంటి ఇబ్బంది లేకుండా!
సాధారణంగా మూత్ర పిండాలు బాగున్నయో? లేదో? అని తెలుసుకునేందుకు పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఖర్చుతో పాటు చాలా సేపు సమయం పడుతుంది. కానీ, ఈ పరీక్ష ద్వారా ఎలాంటి ఖర్చు, ఇబ్బంది లేకుండా కిడ్నీల పని తీరు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. “మూత్రపిండాల పనితీరు పరీక్ష చేయడానికి మూత్ర విసర్జన మాత్రమే సరిపోతుంది. ఇది పెద్ద ఆసుపత్రులలో రోగిని ఐసియులో చేర్చడం లాంటి తీవ్రమైన పరిస్థితులలో చేసే పరీక్ష. అప్పుడు, మొదటగా వైద్యులు మూత్ర విసర్జనను తనిఖీ చేసి, మన మూత్రపిండాలు ఎలా పని చేస్తున్నాయో పూర్తి విశ్లేషణ చేస్తారు” అని డాక్టర్ పర్వేజ్ జోడించారు.
Read Also: ఈ రోడ్ల నుంచి సంగీతం వస్తుంది.. ఈ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే!