Indian Railways: ఆన్ లైన్ లో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. కరెక్ట్ టైమ్ కు వీటిని ఫాలో అయితే, ఈజీగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 3 బెస్ట్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. ఆ టైమ్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే కచ్చితంగా కన్ఫర్మ్ టికెట్ దొరుకుతాయి. ఇంతకీ, ఆ టైమింగ్స్ ఏంటి? ఆ సమయంలో టికెట్స్ ఎందుకు కన్ఫార్మ్ అవుతాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఉదయం 10 నుంచి 11 వరకు
ఒకవేళ మీరు అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తే, తత్కాల్ టికెట్ బుకింగ్ ను ఎంచుకోవాలి. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. స్లీపర్ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. విండో ఓపెన్ కాగానే బుకింగ్ ట్రై చేస్తే, కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ రాత్రి 11:30 నుంచి 12:30 వరకు
ఈ సమయంలో చాలా మంది నిద్రపోతుంటారు. IRCTC వెబ్ సైట్ లో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. ధృవీకరించబడిన టికెట్లను పొందేందుకు ఇదో బెస్ట్ టైమ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ, డే టైమ్ లో ఆటోమేటిక్ గా క్యాన్సిల్ చేయబడిన టికెట్లు తిరిగి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. పలు కారణాలతో పగటి పూట బ్లాక్ చేయబడిన సీట్లు ఈ టైమ్ లో రిలీజ్ అవుఆయి. రోజంతా టికెట్ వెయిట్ లిస్ట్ చేయబడిన రైలుకు ఈ సమయంలో కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ సమయంలో టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
⦿ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు
రైలు బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు రైల్వే సంస్థ జనరల్ కోటాలోని కొన్ని సీట్లను విడుదల చేస్తుంది. ఈ పని సాధారణంగా మధ్యాహ్నం అమలు చేస్తారు. సైట్ లో ట్రాఫిక్ సాధారణంగా ఉన్నప్పుడు.. వెయిట్ లిస్ట్ చేయబడిన కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ సమయంలో చెక్ చేసుకునే వారు తమ వెయిటింగ్ టికెట్‌ను కన్ఫర్మ్డ్ టికెట్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్న లేదంటే గతంలో వెయిట్ లిస్ట్ టికెట్లు పొందిన ప్రయాణీకులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్ఫర్మ్ టికెట్ పొందడానికి టిప్స్
⦿ పైన చెప్పిన మూడు టైమ్ స్లాట్స్ లో బుకింగ్ పొందడ కాస్త గమ్మత్తుగా ఉండవచ్చు. కానీ, కొన్ని టిప్స్ పాటించడం వల్ల కన్ఫర్మ్ అవుతాయి.
⦿ బుకింగ్ ఓపెన్ కావడానికి 2 నిమిషాల ముందు IRCTC వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.
⦿ ప్రయాణీకుల వివరాలను ముందుగానే సేవ్ చేయండి. లేదంటే ఆటోఫిల్ ఫీచర్‌ను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల సమయం ఎక్కువగా తీసుకోకుండా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం మంచిది. మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ బుక్ చేస్తే 60 సెకన్లలోపు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!