Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేయకపోయిన మహేష్ బాబుకు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. ప్రస్తుత మహేష్ బాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక మహేష్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ఇందిరాదేవి, కృష్ణ దంపతుల కుమారుడనే సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణ నటి విజయనిర్మలను పెళ్లి చేసుకోవడంతో విజయనిర్మల కుమారుడు నరేష్ (Naresh)ఈయనకు వరుసకు అన్న అవుతారు. అయితే హీరో నరేష్, మహేష్ బాబు మధ్యపెద్దగా మాటలు లేవని పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి.
నాకోసం భోజనం చేయలేదు..
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నరేష్ వారి ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. విజయనిర్మల అమ్మ, కృష్ణ గారు చాలా మంచి వాళ్ళు. వాళ్లు మంచి వాళ్లను కలిపి వెళ్లిపోయారని నరేష్ తెలిపారు.. ఇందిరా ఆంటీ చనిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమం చేసేటప్పుడు నేను అక్కడ లేను. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడానికి కాస్త ఆలస్యమైంది అయితే అప్పటివరకు కృష్ణ గారు నాకోసం భోజనం చేయకుండా అలాగే ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణ గారి అమ్మాయిలు ఎక్కడున్నావ్ నాన్న నీకోసం భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారని ఫోన్ చేసి చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయని నరేష్ తెలిపారు.
కెరియర్ ఇచ్చి వెళ్లారు…
ఈ మధ్యకాలంలో ఆస్తుల కోసం రక్త సంబంధాలను కూడా పక్కనపెట్టి కొట్టుకుంటున్నారు. కృష్ణ గారు నాకోసమే ఎదురుచూడడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు.. కృష్ణ గారు అమ్మ విజయనిర్మల ఎవరికీ ఏం కావాలో క్లియర్ గా ఇచ్చి వెళ్లారు. వాళ్లు మాకు డబ్బులు, ఆస్తులు ఇవ్వలేదని మంచి కెరియర్ ఇచ్చారని నరేష్ తెలిపారు. మనమంతా ఒకటే కుటుంబమని వాళ్లు చెప్పి వెళ్లిపోయారు. మేము కూడా అలాగే ఉంటామని, ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉంటామని వెల్లడించారు. మా రెండు కుటుంబాలు కలిసే ముందుకు వెళ్తాయని మా రెండు కుటుంబాల మధ్య లోతైన అనుబంధాలు ఉన్నాయని నరేష్ తెలిపారు.
మహేష్ మీద ఈగ వాలనివ్వను..
మహేష్ బాబుకి ఒక అన్నయ్యగా నేను చెబుతున్నాను మహేష్ బాబు మీద, వారి కుటుంబం మీద ఈగ వాలిన నేను వదిలిపెట్టనని అది ఎవరైనా సరే అంటూ తనదైన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు. ఇలా మహేష్ బాబుతో ఇంత మంచి అనుబంధం ఉన్నప్పటికీ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న కూడా ఎదురయింది. బ్రహ్మోత్సవం సినిమాలో మేమిద్దరం కలిసి నటించామనే విషయాన్ని నరేష్ గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహేష్ బాబు తన సినిమాలలో నటీనటులు ఎవరు నటించాలి అనే విషయాలను ఎప్పుడు పట్టించుకోడు. ఆయన ఫోకస్ మొత్తం తన పాత్ర మీదే ఉంటుందని సినిమాలో ఎవరు నటించాలనేది పూర్తిగా దర్శకుల మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. నేను ఆ పాత్రకు సెట్ అవుతానంటే కచ్చితంగా మహేష్ సినిమాలో డైరెక్టర్లు నాకు అవకాశం ఇచ్చే వాళ్లని ఇప్పటివరకు అలాంటి పాత్ర లేదేమో అంటూ నరేష్ ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.