Allu Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో అల్లు కుటుంబం(Allu Family) ఒకటి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ఈయన వారసులుగా అల్లు అరవింద్(Allu Aravind) నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అల్లు లెగసీ కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక అల్లు కుటుంబంలో ఎలాంటి విభేదాలకు చోటు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా అల్లు కుటుంబంలో ఆస్తి పంపకాలు అంటూ ఒక వీడియో బయటకు వచ్చింది.. ఆస్తి పంపకాలు అంటే తన ముగ్గురు కొడుకులకు ఆస్తి పంచడం కాదండోయ్… అసలు మ్యాటర్ ఏంటంటే… అల్లు అరవింద్ నిర్మాతగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా బన్నీ వాసు(Bunny Vasu) ఎస్కేఎన్ (SKN)లాంటి నిర్మాతలను కూడా ప్రోత్సహిస్తూ వారికంటూ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి స్థాయి కల్పించారు. ఇక బన్నీ వాసు, ఎస్ కే ఎన్ కూడా అల్లు అరవింద్ ను ఒక నిర్మాతగా మాత్రమే కాకుండా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు. ఇక అల్లు కుటుంబం గురించి ఎవరేం మాట్లాడిన వెంటనే వీరు రియాక్ట్ అవుతూ తమదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు.
ఐదుగురు బిడ్డలం…
ఇకపోతే తాజాగా బన్నీ వాసు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిత్రమండలి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత ఎస్ కే ఎన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… అల్లు అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు కాదు ఐదుగురు కొడుకులం. ఆ ముగ్గురితోపాటు నేను బన్నీ వాసు కూడా ఆయనకు కొడుకులు లాంటి వాళ్ళమేనని తెలిపారు. ఒక చేతికి 5 వేళ్ళు ఎలా విడిగా ఉంటాయో మేము కూడా అలాగే ఉంటామని, ఏదైనా సమస్య వస్తే ఈ 5 వేళ్ళు పిడికిలిగా మారతాయని అల్లు కుటుంబం పై వారికున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.
ఆస్తిలో వాటా కావాలి..
ఇకపోతే ఇదే కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ గారి ఆస్తిలో కూడా వాటా కావాలి అంటూ సరదాగా ఎస్కేఎన్ మాట్లాడారు. ఇలా ఆయన మమ్మల్ని కొడుకులుగా చూసుకుంటారు కాబట్టి జూబ్లీహిల్స్ 36 చివరన ఒక బిల్డింగ్ ఉంది అందులో కూడా మాకు వాటా కావాలి అంటూ మాట్లాడారు. ఇలా ఆస్తిలో వాటా కావాలి అంటూ అడగకపోవడం మా సంస్కారం, మేము అడగకపోయినా ఇవ్వటం ఆయన మంచితనం అంటూ ఆస్తి కావాలని అడిగేసారు. అయితే ఇదంతా కూడా సరదాగే చెప్పారని తెలుస్తోంది. మేము ఆయన బిడ్డలం కాకపోయినా సొంత బిడ్డల లాగే మమ్మల్ని చూసుకున్నారు. అలాగే మేము కూడా తనకు ఏదైనా ఆపద వస్తే ఒక్క క్షణం ఆగమని తనకోసం ఎంతటి దూరమైన వెళ్తామని ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ చెప్పకనే చెప్పేశారు.