Actor Naresh: సీనియర్ దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల(Vijaya Nirmala) వారసుడిగా నటుడు నరేష్(Naresh) ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం నరేష్ ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత విషయాల ద్వారా తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ఈయన పెళ్లిళ్లు విడాకుల వల్ల తరచు వార్తల్లో నిలిచారు.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)తో ఈయన సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియగానే నరేష్ మూడో భార్య రమ్య అప్పట్లో పెద్ద గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ వివాదాలన్నింటిని ఎదుర్కొని పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా తమ జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇక నరేష్ ఈ వయసులో నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల విమర్శలు కూడా బయటకు వచ్చాయి.
మూడు పెళ్లిళ్లు…
నరేష్ కేవలం పవిత్ర లోకేష్ ను డబ్బు కోసమే ట్రాప్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నరేష్ ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నాకు మొదటి పెళ్లి 19 సంవత్సరాల వయసులోనే జరిగిందని, పెళ్లి తర్వాత అమ్మాయి తనతో ఉండటం ఇష్టం లేక విడిపోయిందని తెలిపారు. ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తాను రాజకీయాలలోకి వెళ్ళటంతోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం విడాకులు తీసుకుని విడిపోవడం జరిగిందని తెలిపారు. ఇక మూడో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలవలేదని అలాగే తాము ఒకరితో మరొకరు కలిసి ఉండలేక విడిపోయామని తెలిపారు. ఇలా ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన తర్వాత పవిత్ర లోకేష్ తో నా ప్రయాణం సంతోషంగా ఉందని తెలిపారు.
తోడు అవసరం…
ఈ వయసులో తనతో కలిసి జీవించడానికి ప్రధాన కారణం ఒక తోడు కావాలనే అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు. ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత తోడు అనేది చాలా అవసరం అందుకే ఆమెతో కలిసి ఉంటున్నానని తెలిపారు. ఆమెలో నేను మా అమ్మను చూసుకుంటున్నాను. నాకు ఏం కావాలన్నా ఒక అమ్మ లాగా చేసి పెడుతుంద, నేను ఏ దేశం వెళ్లిన నా కోసం పవిత్ర ప్రత్యేకంగా వంట చేసి పెడుతుంది. ఈ లక్షణాలన్నీ నచ్చే తనతో ఈ ప్రయాణం మొదలు పెట్టానని నరేష్ తెలిపారు. డబ్బు కోసమే నేను తనతో ఉంటున్నానని ఎంతోమంది వార్తలు రాశారు అదేది నిజం కాదని, నా దగ్గర కూడా బోలెడు డబ్బు ఉందని, ఈ వయసులో తోడు అవసరం కనకే తనతో సహజీవనం చేస్తున్నట్లు, తనతో నా జీవితం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.