Actor Vishal Defamation Case : కోలీవుడ్ స్టార్ విశాల్ (Vishal) హీరోగా నటించిన ‘మద గజ రాజా’ (Madha Gaja Raja) మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ప్రమోషన్లలో ప్రెస్ మీట్ జరగ్గా, విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతులు వణకడం, కనీసం మైక్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోవడంతో విశాల్ కి ఏమైంది ? అనే టెన్షన్ మొదలైంది ఫ్యాన్స్ కి. ఆ తరువాత విశాల్ హెల్త్ పై రోజుకో పుకారు పుట్టుకు వచ్చింది. అలా రూమర్స్ ను ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానల్స్ పై సీనియర్ నటుడు నాజర్ (Nassar) సీరియస్ అయ్యారు. ఏకంగా పరువు నష్టం దావా వేసి షాక్ ఇచ్చారు.
విశాల్ కు అనారోగ్యం
సుందర్ సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మించిన ‘మద గజ రాజా’ చిత్రం జనవరి 10న విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ప్రెస్ మీట్ లో విశాల్ (Vishal) అసిస్టెంట్ సహాయంతో వేదికపైకి వచ్చి, వణుకుతున్న చేతులతో మైక్ పట్టుకుని మాట్లాడాడు. మాట్లాడుతున్న టైమ్ లో ఆయన నీరసంగా కన్పించారు. అతని కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారగా, విశాల్ ఆరోగ్యంపై ఎలాంటి హెల్త్ అప్డేట్ ను ఇవ్వలేదు. కానీ విశాల్ పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ లు ఆయనకు వైరల్ ఫీవర్ అని మెడికల్ సర్టిఫికేట్ ను మాత్రమే విడుదల చేశారు.
వైరల్ గా మారిన ఆ వీడియోను చూశాక చాలా మంది విశాల్ (Vishal) ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే ఏకంగా విశాల్ హెల్త్ విషయంలో హద్దు మీరి దారుణంగా రూమర్లను స్ప్రెడ్ చేశారు. వారిపై తాజాగా నాజర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఆ ఛానల్స్ పై పరువు నష్టం దావా
విశాల్ (Vishal) పై ఓ యూట్యూబర్ పరువు నష్టం కలిగించే విధంగా అబద్దపు ప్రచారం చేశాడని నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ (Nassar) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తానంపేట పోలీసులు యూట్యూబర్ సెగురాపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాజర్ దాఖలు చేసిన ఫిర్యాదులో “విశాల్ కు మందుకు అడిక్ట్ అవ్వడం వల్ల చేతులు, కాళ్ళు వణుకుతున్నాయని యూట్యూబర్ సెగురా అబద్ధపు ప్రచారం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా పరువు నష్టం కలిగించడమే” అని పేర్కొన్నారు. ఈ కేసులో సెగురాపై మాత్రమే కాదు అతని కామెంట్స్ ను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని నాజర్ ఫిర్యాదు చేశారు. నాజర్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు తేనాంపేట పోలీసులు పరువు నష్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌తో సహా మూడు సెక్షన్ల కింద సెగురాతో పాటు మరో రెండు యూట్యూబ్ ఛానెల్‌లపై కేసు నమోదు చేశారు.