BigTV English

Actor Nikhil Siddhartha: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీంపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్

Actor Nikhil Siddhartha: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీంపై హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్


Actor Nikhil Tweet On Indian FootBall Team: ఇండియన్ ఫుట్ బాల్ టీంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సంచలన ట్వీట్ చేశారు. ఫిఫి వరల్ట్ కప్ క్వాలిఫయర్స్ లో ఇండియన్ టీం కనబర్చిన ఆటపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఇప్పుడే తీవ్ర నిరాశ పర్చిన మన ఇండియన్ ఫుట్ బాల్ టీం ఆటను చూశాను. ఈ ఆటకు మన ఇండియన్ ఫుట్ బాల్ టీం సిగ్గు పడాలి. ప్రపంచంలోనే అత్యంత పేరు, జనాభా ఉన్న దేశం మనది. మనకు గెలిచే అర్హత ఉంది. మన టీం ఇంతకంటే గొప్ప ప్రదర్శణ ఇవ్వాల్సి ఉండేది. దయచేసి మన ఇండియాలోని టీంను ప్రక్షాళన చేయండి’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ కు ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని ట్యాగ్ చేశారు. దీంతో ప్రస్తుతం నిఖిల్ చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్ట్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ఖతార్ లో జరుగుతున్నారు. ఈ క్రమంలో ఖతార్ వేదికగా ఇండియా ఇచ్చిన ప్రదర్శన దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను నిరాశపర్చింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తలపడింది. ఈ ఆటలో ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండా డ్రా అయ్యింది.


ఫస్ట్ సెషన్ హాఫ్ టైంలో మన్ వీర్ సింగ్ గోల్ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. రెండు సార్లు గోల్స్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో విక్రమ్ ప్రతాప్ కూడా గోల్ చేయలేక నిరాశ పరిచాడు. దీంతో జీరో గోల్స్ చేసి ఇండియా డ్రా అయ్యింది. ప్రస్తుతం ఈ ఆటతో భారత్ గ్రూప్ ఎలో రెండో స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచులు ఆడి 4 పాయింట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 3 మ్యాచ్ లు ఆడిన ఖతర్ 9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×