ప్రముఖ కన్నడ హీరో దర్శన్ (Darshan)కన్నడ నాట స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. అక్కడ పలు చిత్రాలు చేస్తూ అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న దర్శన్.. అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కొని జైలు జీవితం అనుభవిస్తున్నారు. అయితే అక్కడ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే.. చికిత్స నిమిత్తం ఆరు వారాలపాటు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈయనపై అమితమైన ప్రేమ పెంచుకున్న ఒక హీరోయిన్ మాత్రం .. తాను చచ్చే వరకు దర్శన్ తన కొడుకే అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
నేను చచ్చేవరకు దర్శన్ నా కొడుకే..
తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో పాల్గొన్న.. ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత (Sumalatha ) దర్శన్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శన్ గురించి సుమలత మాట్లాడుతూ..” గతంలో దర్శన్ తో నాకు మంచి సంబంధం ఉండేది. అయితే ఇప్పటికీ ఆ బంధం అలాగే కొనసాగుతోంది. దర్శన్ సతీమణి ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నారు. దర్శన్ ఆరోగ్యం ప్రస్తుతం అంతా మెరుగ్గా లేదు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి కూడా బయటపడతారనే నమ్మకం నాకు చాలా ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్ నా కుమారుడే. ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. రేణుకా స్వామి (Renuka Swamy) హత్య కేసులో నిజం బయటపడి దర్శన్ నిరపరాధిగా బయటకు రావాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని ఆశిస్తున్నాను” అంటూ సుమలత చెప్పుకొచ్చింది.
దర్శన్ అభిమానులు ఫిదా..
ఇకపోతే సుమలత.. దర్శన్ తన కొడుకు అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈమె మంచి మనసుకు దర్శన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే దర్శన్ మంచివాడని, ఆయన నిరపరాధి అని, దయచేసి ఆయనను వదిలిపెట్టండి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
200కు పైగా చిత్రాలలో నటన..
సుమలత విషయానికి వస్తే.. తెలుగు సినిమా నటి అయిన ఈమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 200 కు పైగా చిత్రాలలో నటించింది. 1963 ఆగస్టు 27న మద్రాస్ లో పుట్టి బొంబాయి, ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఈమె గుంటూరులో జరిగిన అందాల పోటీల్లో నెగ్గిన తర్వాత తన 15 యేటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇది మొత్తం ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగులో తొలిసారి విజయ్ చందర్ హీరోగా నటించగా.. బాపూ దర్శకత్వం వహించిన ‘రాజాధిరాజు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత కృష్ణతో ‘ సమాజానికి సవాల్ ‘ చిత్రంలో కూడా నటించింది.
గౌరవ డాక్టరేట్ అందుకున్న సుమలత..
1992లో సహ కన్నడ నటుడు అయిన అంబరీష్ (Ambarish )ను ప్రేమ వివాహం చేసుకొని, బెంగళూరులో స్థిరపడింది. 2019 ఎన్నికలలో సుమలత పార్లమెంట్ కు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది. ఆ తర్వాత ఈ ఏడాది 2024 జనవరి 24న యునైటెడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ కూడా సొంతం చేసుకుంది.