Intinti Ramayanam Today Episode November 11th : గత ఎపిసోడ్ విషయానికొస్తే… కోమలి చేసిన పనికి వెళ్ళిపోయినా వినోద్ కోసం అందరు బాధపడతారు. పొద్దున్నే కోమలి బాధ పడుతూ ఉంటుంది. ఇంట్లోని ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క మాట అంటారు. నాదేమీ అనుమానం కాదు ముందు జాగ్రత్త అని కోమలి అప్పటికి తన తప్పని ఒప్పుకోకుండా చెప్తుంది. నన్ను అనడం కాదు అందరు అంటే ఎలా అని ఏడుస్తుంది. అక్షయ్ కూడా కోమలి మీద సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరు వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడడానికైనా ఉంటుంది కదా అని అంటారు కానీ వినోద్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అవని అక్షయ్ ని పక్కకు రమ్మని పిలుస్తుంది. పల్లవి ఇక తనకు అబార్షన్ చేస్తున్న డాక్టర్ తో ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా హాస్పిటల్ కి వెళుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసిన డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి పల్లవి ఎంట్రీ అయ్యి ఎందుకు నా ఫోన్ మీరు కట్ చేస్తున్నారు అసలు నాకు అబార్షన్ చేశారా లేదా అని నిలదీస్తుంది. అవని చెప్పడం వల్ల నీకు అబార్షన్ చేయలేదని డాక్టర్ నిజం చెబుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి చూడ్డానికి రాజేశ్వరి చక్రధర్ ఇంటికి వస్తారు. పల్లవి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే అందరూ తలా ఒక మాట అంటారు. చక్రధర్ మధ్యలో పల్లవికి సపోర్ట్ చేస్తాడు. పల్లవి నాన్న సపోర్ట్ చూసుకొని హమ్మయ్య అనుకుంటుంది. లోపలికి తీసుకెళ్లిన చక్రధర్ ఏమైంది ఎక్కడికి వెళ్లావు హాస్పిటల్ కి వెళ్ళావా ఏంటి అని అడుగుతాడు. అవును డాడ్ హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ డాక్టర్ మనల్ని మోసం చేసింది. అవ్వనినే దానికి కారణమని పల్లవి చెప్పగానే షాక్ అవుతాడు. అవినీకు ఎలా తెలుసు? అసలు ఎందుకు అవని ఆ టైంలో హాస్పిటల్ కి వెళ్ళిందని చక్రధర్ పల్లవి అని అడుగుతాడు. ఎన్ని రోజులు మనం అవని అనాధ అని అనుకున్నాం కానీ దానికి ఒక అమ్మ తమ్ముడు కూడా ఉన్నాడు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు అవని అనాధ అని ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా పొంగిపోతారనేసి పల్లవి ఉంటుంది . అవని కుటుంబాన్ని ఫ్రాడ్ కుటుంబం అని నిరూపిస్తే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు మన సేఫ్ అని చక్రధర పల్లవి మాట్లాడుకుని అవని వాళ్ళ నాన్న ఎవరో కనిపెట్టాలని చూస్తారు. వాళ్ళ నాన్న చేతనే పల్లవిని నాలుగు తన్ని ఇచ్చి కంట్రోల్లో పెట్టిద్దామని ఇద్దరు ప్లాన్ వేసుకుని బయటికి వస్తారు. ఇక మేము వెళ్తామని చక్రధర్ అనగానే పార్వతి ఇంకా రెండు రోజులు ఉండొచ్చు కదా అన్నయ్య అని అడుగుతుంది. లేదమ్మా పనులు చాలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి వస్తామని వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళగానే అక్షయ్ ,అవనీలు వినోదం తీసుకొని వస్తారు. కమల్ అక్క బావ వచ్చాడని అరుస్తాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు . ఒక పల్లవి మాత్రం షాక్ అవుతుంది. నేను మీ అమ్మాయి మీద కోపం తగ్గి రాలేదు అవని అక్కే నన్ను తీసుకొని వచ్చింది నా మనసు మార్చేసింది అని అవనిపై పొగడ్తలు కురిపిస్తాడు వినోద్. ఇందులో నేను చేసింది ఏమీ లేదు అత్తయ్య అంతా మీ అబ్బాయి చేశాడని అక్షయ మీద అవని చెప్తుంది.
ఇక అందరూ అవనీని పొగుడుతూ ఉంటారు.. అది చూసి పల్లవి సహించలేక పోతుంది. వీడు పెళ్ళాన్ని వదిలిపెట్టి ఉండలేక వచ్చేసాడు దానికి అవని అని చెప్పి పేరు చెప్పాడు అని అర్థమవుతుందని పల్లవి మనసులో అనుకుంటుంది. ఏదైతేనెం వినోద్ ఇంటికి వచ్చాడు ఇకమీదట కోమలి ఏదైనా తప్పు చేస్తే మా అమ్మాయిని కాదు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి ఫుల్ రైట్ మీకు ఇచ్చేసామని పార్వతి రాజేంద్రప్రసాద్ అంటారు. ఇక బామ్మ కూడా అనబోతుంటే దానికి కమల్ అడ్డుపడి ఆ డైలాగ్ నాది నేను చెప్పాలని మా అక్క ఏదైనా చేస్తే నువ్వు కొట్టు తిట్టు అనేసి చెప్తాడు. వినోద్ ఇంటికి రావడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక కమల్ పల్లవి ఫోన్ మాట్లాడుతుంటే లాక్కుంటాడు. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావ్ ఫోన్ అని అడగ్గానే పల్లవి షాక్ అవుతుంది. నేను మాట్లాడినంత విన్నాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వాళ్ళ నాన్నతో మాట్లాడడం చూసి ఓ మామయ్యతో మాట్లాడుతున్నావా ఓకే మామయ్య పల్లవిని ఈ టైం వరకు ఫోన్లు మాట్లాడొద్దని చెప్పారు పల్లవి పడుకునే టైమ్ ఇది మీరు ఫోన్ పెట్టేసేయండి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
దుప్పటి దిండు తీసుకుని బయటకు వెళుతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అవని అడుగుతుంది. కొత్తగా అడుగుతున్నావేంటి రోజు ఎక్కడికి వెళ్తున్నా అని అక్షయ్ అంటాడు. పొద్దున వినోద్ విషయంలో బాగానే ఉన్నారు కదా ఇంతలోకి మీకు ఏమైంది అని అంటే అది ఇంట్లో విషయం ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో అలానే ఉండాలి ఇది నా పర్సనల్ విషయం ఇలానే ఉండాలి అని అవనితో చెప్తాడు. మీరు అసహ్యించుకునేంత పని నేను ఏం చేశాను ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అని అవని అడుగుతుంది. నువ్వు నా దగ్గర నిజం దాచే అంతవరకు ఇలానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నిజం చెప్తావో అప్పుడే నేను నీకు ఈ విషయం చెప్తానని అంటాడు అక్షయ్. వెళ్తున్న అక్షయ్ ని అవని ఆపుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక కోమలి వినోద్ కలవడంతో అందరు గుడికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం పల్లవి ప్లాన్ లో భరత్ బలి అవుతాడు. ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..