BHEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఈ, బీటెక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తిరుచిరాపల్లి(BHEL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 19న దరఖాస్తు గడువు ముగియనుంది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తిరుచిరాపల్లి(BHEL) పలు అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తిరుచురాపల్లిలో మొత్తం అప్రెంటీస్ పోస్టుల వెకెన్సీ సంఖ్య: 655
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ తిరుచురాపల్లిలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
* గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లో మెకానికల్ ఇంజినీరింగ్ 95 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ 20 పోస్టులు, అసిస్టెంట్ హెచ్ఆర్ 10 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
*టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ 70 పోస్టులు, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ 10 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 10 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
*ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధించి ఫిట్టర్ పోస్టులు 180, వెల్డెర్ పోస్టులు 120, ఎలక్ట్రీషియన్ పోస్టులు 40, టర్నర్ పోస్టులు 20, మెకానిస్ట్ పోస్టులు 30, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులు 10, మోటార్ మెకానిక్ పోస్టులు 10, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ పోస్టులు 7, COPA పోస్టులు 13 వెకెన్సీ ఉన్నాయి.
పోస్టుల వెకెన్సీ వారీగా..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 125 ఉద్యోగాలు
టెక్నీషియన్ అప్రెంటీస్: 100 ఉద్యోగాలు
ట్రేడ్ అప్రెంటీస్: 430 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 5
దరఖాస్తు ప్రక్రియకు లాస్ట్ డేట్: 2025 ఫిబ్రవరి 19 (ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 19 లోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.)
వయో పరిమితి: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు అయితే 27 ఏళ్ల మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బీటెక్, బీఈ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://trichy.bhel.com/
అర్హత ఉన్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. అప్రెంటీస్ పోస్టుకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. 12 నెలల పాటు అప్రెంటీస్ షిప్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 655
దరఖాస్తుకు లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19