Prudhvi Raj:పృథ్వీ రాజ్ (Prudhvi Raj) .. ప్రముఖ వెండితెర నటుడు పృథ్వీరాజ్ ఈమధ్య కాలంలో ఎక్కువగా కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీని ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు అటు వైసీపీ అభిమానులనే కాదు ఇటు అల్లు అర్జున్ అభిమానులను కూడా పూర్తిస్థాయిలో హర్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈయన నటించిన లైలా సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఏకంగా 25 వేలకు పైగా ట్వీట్లు వేయడంతో అటు విశ్వక్ సేన్ ఇటు నిర్మాత సాహు గారపాటి (Sahoo Garapati) స్పందిస్తూ.. పృథ్వీరాజ్ పై విమర్శలు గుప్పించారు. దయచేసి తమ సినిమాను చంప్పొద్దని వేడుకున్నారు.
క్షమాపణలు చెప్పిన పృథ్వీ రాజ్..
ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో దిగివచ్చిన పృథ్వీరాజ్ అందరికీ క్షమాపణలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..” వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నావల్ల సినిమా దెబ్బ తినకూడదు అని అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని మాత్రమే అనండి. ఫలక్ నామా దాస్ కంటే కూడా ఈ సినిమా అతిపెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ పృథ్వీ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
ఫిబ్రవరి 9వ తేదీన విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) జంటగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్ చేసుకోవడానికి విశ్వక్ సేన్ తోపాటు నిర్మాత సాహు గారపాటి వెళ్ళిపోయారు. ఆ సమయంలో స్టేజిపై పృథ్వీ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ..”ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ లో నటించాను. ఒక షాట్ లో భాగంగా ఎన్ని మేకలు ఉన్నాయంటే 150 మేకలు అని చెబుతారు.యాదృచ్ఛికమేమిటంటే చివరికి వచ్చేసరికి 11 మిగిలాయి” అంటూ కామెంట్లు చేశారు. ఇక్కడ ఆయన వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. ఇక 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీని ఇండైరెక్టుగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడని, అందుకే పృథ్వి పై విమర్శలు గుప్పించారు. వాస్తవానికి ఒకప్పుడు వైసిపి పార్టీలో కొనసాగిన పృథ్వీరాజ్ అక్కడ కాస్త విభేదాలు రావడంతో పార్టీ మారి జనసేనలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు అల్లు అభిమానులు కూడా ఈయనపై విమర్శలు గుప్పించారు.