Turmeric For Face: పసుపును ప్రతి ఇంట్లో పూజలకు, ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడానికి మాత్రమే కాకుండా, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఉపయోగిస్తారు. పసుపు యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు సహజ కాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా మెరిసేలా చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపుతో ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపు, శనగపిండితో ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. అంతే కాకుండా టానింగ్‌ను తొలగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 టీస్పూన్ల శనగపిండి, 1/2 టీస్పూన్ పసుపు , 1 టీస్పూన్ పెరుగు లేదా రోజ్ వాటర్ కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. తరువాత తయారుచేసిన మాస్క్‌ను శుభ్రమైన ముఖం, మెడపై అప్లై చేయండి. దీన్ని దాదాపు 15-20 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అనంతరం సున్నితంగా స్క్రబ్ చేయండి. వారానికి 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల ముఖానికి తక్షణ మెరుపు వస్తుంది.
2. పసుపు, గంధపు ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మచ్చలను కూడా రాకుండా చేస్తుంది.చర్మ కాంతిని పెంచుతుంది. ఈ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ గంధపు పొడి ,2 టీస్పూన్ల రోజ్ వాటర్ కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు దీన్ని ముఖం , మెడపై సమానంగా అప్లై చేయండి. దీని తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని తాజాగా , ప్రకాశవంతంగా ఉంచుతుంది.
Also Read: జుట్టుకు హెన్నా, హెయిర్ డైలను వాడుతున్నారా ?
3. పసుపు ,కలబంద ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చికాకు, మంటను కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల తాజా కలబంద జెల్ తో పాటు 1 టీస్పూన్ తేనె తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇలా తయారుచేసిన పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వాడండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలంటే పసుపును వాడటం అలవాటు చేసుకోండి. దీనిని తరచుగా వాడటం వల్ల అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.