Posani Arrest.. ప్రముఖ సినీ నటులు, రాజకీయవేత్త పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali) ని నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా మరో నటుడు పృథ్వీరాజ్ (Prudhviraj )స్పందించారు.” నోటి దూలకు తగిన శాస్తి తప్పదు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది. మాట చాలా విలువైనది. అందుకే ఎప్పుడూ పొదుపుగా వాడాలి. నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ట్వీట్ చూసిన కొంతమంది పృథ్వీ కామెంట్స్ కి వత్తాసు పలుకుతుంటే.. మరికొంతమంది పృథ్వీరాజ్ పై కామెంట్లు చేస్తున్నారు. నోటి దూల గురించి, మాటల పొదుపు గురించి నువ్వే మాట్లాడాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇప్పుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పోసాని అరెస్టు.. అసలేమైందంటే..?
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయనను ఏపీకి తరలిస్తున్నారు. గతంలో అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. గతంలో సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయగా.. ఆయనపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఓబులవారిపల్లెకు పోసానిని తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను రాజంపేట హైకోర్టులో కూడా హాజరు పరచనున్నారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన పోసాని కృష్ణమురళి..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిన్న పోలీస్ అధికారులు అరెస్టు చేయడానికి వెళ్లడంతో పోలీసు అధికారులతో పోసాని వాగ్దానికి దిగారు. ఇక తనదైన శైలిలో వ్యవహరిస్తూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇక దీంతో అతి కష్టం మీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పనిచేసిన పోసాని అప్పుడు రెచ్చిపోయారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పాటు నారా లోకేష్ (Nara Lokesh) పై కూడా నాడు ఆయన విచక్షణారహితంగా కామెంట్లు చేశారట. ఈ నేపథ్యంలోనే కూటమి నేతల ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
నోటిధులకి తగిన శాస్తి తప్పదు,
నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది.మాట విలువైనది చాల పొదుపుగా వాడాలి…
నిజం తెలుసుకుని ఎప్పుడు ఆగిపోవలో తెలిసిన వాడు మహాపురుషుడు … #Arrest
— prudhvi actor (@ursprudhviraj06) February 26, 2025