BigTV English

Elon Musk DOGE Canada Citizenship: మస్క్ కు వరుస షాక్ లు.. డొజెలో రాజీనామాలు.. ప్రమాదంలో కెనెడా పౌరసత్వం

Elon Musk DOGE Canada Citizenship: మస్క్ కు వరుస షాక్ లు.. డొజెలో రాజీనామాలు.. ప్రమాదంలో కెనెడా పౌరసత్వం

Elon Musk DOGE Canada Citizenship| అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరుతో పోలిస్తే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇటీవల ఎలాన్ మస్క్ పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ విషయంలో, కెనడా పార్లమెంట్ లో ఒక పిటిషన్ దాఖలు చేయబడింది, దీనిలో ఎలాన్ మస్క్ కెనడా సార్వభౌమత్వాన్ని హాని పరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ పిటిషన్ ప్రకారం, మస్క్ కెనడా పౌరసత్వం మరియు పాస్పోర్టును రద్దు చేయాలని కోరుతోంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై 2,82,037 మంది కెనడా పౌరులు సంతకాలు చేసారు. ఈ పిటిషన్ జూన్ 20 వరకు తెరిచి ఉంటుంది. ఈ పిటిషన్ ను క్యూలియా రీడ్ మరియు ఎన్డీపీ పార్లమెంట్ సభ్యుడు చార్లీ ఆంగస్ తయారు చేశారు. ఈ పిటిషన్ లో, మస్క్ కెనడా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. “ప్రస్తుతం మస్క్ విదేశీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. కెనెడా సార్వభౌమత్వంపై దాడి చేయడానికి ప్రయత్నించారు” అని పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ పై మస్క్ స్పందించారు. “కెనెడా నిజమైన దేశం కాదు” అని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసి.. తర్వాత దాన్ని డెలీట్ చేశారు. కెనెడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. తమ దేశ పౌరుడు ఏదైనా మోసానికి పాల్పడినా లేదా ఇమిగ్రేషన్ శాఖకు తప్పుడు సమాచారం అందించినా, అతని పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంది.


టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉంది. అతను అక్కడే జన్మించారు. 1989 లో అతని కుటుంబం కెనడా కు వలస వచ్చిన తర్వాత, అతనికి కెనడా పౌరసత్వం లభించింది. తర్వాత 2002 లో అతను అమెరికా పౌరసత్వం పొందారు.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కొన్ని రోజులుగా ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ, ఆ దేశాన్ని బెదిరిస్తూ అదనపు టారిఫ్ లు విధించడం ప్రకటించారు.


Also Read:రహస్య కూటమి నుంచి కెనడాను తప్పించేందుకు అమెరికా ప్లాన్.. పట్టువీడని ట్రంప్

మరోవైపు, అమెరికాలో ఒక కీలకమైన పరిణామం జరిగింది. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజె లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేశారు. కీలకమైన సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపు కోసం తమ సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించలేమని స్పష్టం చేశారు. ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు వంటి వారు మూకుమ్మడిగా రాజీనామా చేయడం మస్క్ మరియు ట్రంప్ కు షాక్ అని భావిస్తున్నారు. “మేము అమెరికన్ ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేశాం. అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలను నిలబెట్టడానికి ప్రమాణం చేశాం” అని సంయుక్త రాజీనామా లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజె లో రాజకీయ ఉద్దేశాలు కలిగిన వారే ఎక్కువగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి నైపుణ్యం లేదని ఆరోపించారు.

డోజె రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40% నిరుపయోగమే
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డోజె రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమేనని తేలింది. వాటి వల్ల ఖజానాకు నిధులు ఆదా అయ్యేదేమీ లేదని వెల్లడైంది. గత వారం నాటికి 1,125 కాంట్రాక్టులను డోజె రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడమే దీనికి కారణమని వెల్లడైంది.

డెమోక్రట్లతో ప్రాణహాని
మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజె) ప్రభుత్వ విభాగాల్లో స్వచ్ఛత కోసం అనేక ముఖ్యమైన విధానాలను అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల అతని పద్ధతులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల, ఎలాన్ మస్క్ డెమోక్రట్లు తనను హత్య చేయాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అమెరికాలో పన్ను చెల్లించేవారి డబ్బు దుర్వినియోగం చేయబడుతోందని బహిర్గతం చేస్తున్నారని ఒక యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి మస్క్ ప్రతిస్పందించి, ‘‘డెమోక్రట్లు నన్ను చంపాలని చూస్తున్నారు. ఇది ఎంత పెద్ద విషయమో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు’’ అని రిప్లై ఇచ్చారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×