Ram Charan : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఆయన ఒక మెడిసిన్. ఆయన సినిమాలు ఎక్స్పైరీ డేట్ లేని మెడిసిన్ అని చెప్పాలి. జీవితంలో ఎవరు ఎప్పుడు లోలో ఫెయిల్ అయినా కూడా ఆయన వీడియోలు చూస్తూ ఉత్సాహం తెచ్చుకోవడం, నవ్వుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది. ఆయన కెరియర్ లో చేసిన ఎన్నో పాత్రలు ఇప్పటికీ పెదవుల పైన నవ్వులు పూయిస్తాయి. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రఫీలో మంచి టాలెంట్ ఉంది రాజాకి. రాజా సినిమాల్లో కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే సరైన హిట్ సినిమా ఇప్పటివరకు రాజా కెరియర్ లో పడలేదు. మను సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కానీ, మంచి ప్రశంసలు మాత్రం తీసుకొచ్చింది.
రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బ్రహ్మానందం. ఈ సినిమాతో ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమా మీద బజ్ లేదు అయినా కానీ మౌత్ టాక్ వలన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పటం వలన కలెక్షన్స్ కూడా కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన విశ్వక్సేన్ లైలా సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విశ్వక్సేన్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా ఆ సినిమా మిగిలింది. మామూలుగా సినిమా తర్వాత హడావిడి చేసే విశ్వక్సేన్ ఈ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయాడు.
Also Read : Pradeep Ranganathan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు
బ్రహ్మానందం సినిమా విషయానికి వస్తే స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. రాహుల్ యాదవ్ నక్క ఎటువంటి సినిమాలు తీస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నలుగురు కొత్త దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రాహుల్ యాదవ్ కు దక్కుతుంది. ఇక బ్రహ్మానందం సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమాపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన అభినందనలు తెలియజేశారు. ఈ సినిమా సక్సెస్ అయినందుకు రాజా గౌతమ్ గారికి బ్రహ్మానందం గారికి నా అభినందనలు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీను షేర్ చేశారు. ఈ స్టోరీని పోస్ట్ చేస్తూ చిత్ర యూనిట్ రామ్ చరణ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పటినుంచో హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న రాజా గౌతమ్ కు ఈ సినిమా ప్లస్ గా మారింది.
Team #BrahmaAnandam extends heartfelt gratitude to Global Star @AlwaysRamCharan garu for his love, support, and best wishes on our blockbuster success! 🔥🤩
Book your Tickets -🎟️https://t.co/unGCBd6ASP@RahulYadavNakka @Swadharm_Ent @rvs_nikhil25 #Brahmanandam… pic.twitter.com/Bwnd1ahNjO
— Vamsi Kaka (@vamsikaka) February 17, 2025