BigTV English

Pradeep Ranganathan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

Pradeep Ranganathan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు

Pradeep Ranganathan :ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. వాళ్లలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ప్రదీప్ రంగనాథన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీప్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో మనందరికీ తెలిసిందే. తమిళ్లో 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డబ్బింగ్ చేశారు. అయితే తెలుగులో కూడా ఈ సినిమా మంచి సంచలనాలకు తెరతీసి అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. దిల్ రాజుకు ఈ సినిమా మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది.


ఇక ప్రదీప్ విషయానికి వస్తే ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు. చాలా చిన్న ఏజ్ లోని ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు ప్రదీప్. ప్రదీప్ చేసిన చాలా షార్ట్ ఫిలిమ్స్ కి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ప్రదీప్ హిట్ అందుకున్న లవ్ టుడే సినిమా కూడా ఒకప్పుడు ప్రదీప్ తీసిన షార్ట్ ఫిలిం నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిందే అని చెప్పొచ్చు. ప్రదీప్ తీసిన షార్ట్ ఫిలిం అప్పట్లోనే మంచి వైరల్ గా మారింది. ఆ తర్వాత అదే కాన్సెప్ట్ ను సినిమాగా మలిచి ప్రేక్షకులకు అందించాడు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ప్రస్తుతం ఉన్న టైంలో ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ దర్శకుడు లేదా ఆ నటుడు తర్వాత సినిమాలు ఏంటో త్వరగా ప్రేక్షకులకు తెలిసిపోతాయి. కానీ కొందరు మాత్రం వచ్చిన అవకాశాలు అన్నిటిని వాడుకోకుండా ఆచితూచి అడుగు వేసి కెరియర్ లో ముందుకు వెళ్తానని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ కూడా అదే పంథాలో కొనసాగుతున్నాడని అర్థమవుతుంది. ప్రదీప్ తన డైరెక్షన్లో తదుపరి సినిమా ఉండబోతుంది అని అనుకున్నారు చాలామంది. అలానే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా తీయబోతున్నాడు ప్రదీప్ అని వార్తలు కూడా వినిపించాయి.


ఇవేవీ కాకుండా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ డ్రాగన్ చేశాడు. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. అశ్వత్ మారిముత్తు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాను చేసిన ఓ మై కడవులే సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి సంచలనాలకు తెరతీసిందని చెప్పవచ్చు. అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తమిళ్ లో చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా ఈవెంట్ రాత్రి జరిగింది. ఈవెంట్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు చెప్పినట్లు ప్రేక్షకులతో తెలుగులో మాట్లాడాడు. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియా వేదిక చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు అంటూ ప్రదీప్ కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

Also Read : Tollywood Heroine: రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×