Producer SKN :’లవ్ టుడే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ (Pradeep Ranganath) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటు తెలుగులో కూడా విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘డ్రాగన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించగా.. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), నిర్మాత ఎస్ కే ఎన్ (SKN) హాజరయ్యారు. ఇక ప్రదీప్ రంగనాథన్ ఈ ఈవెంట్లో తెలుగులో మాట్లాడి అందరిని అబ్బురపరిచారు. అంతేకాదు ఇదే ఈవెంట్ లో ఎస్కేఎన్ ఒక తెలుగు హీరోయిన్ గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
వైష్ణవి చైతన్యపై నిర్మాత షాకింగ్ కామెంట్..
అసలు విషయంలోకి వెళ్తే .. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన స్టేజ్ ఎక్కాడంటే ఏదో ఒక కాంట్రావర్సీ పుట్టిస్తాడు అనే ముద్ర కూడా పడిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు హీరోయిన్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆయన హీరోయిన్ కాయడు లోహార్ గురించి మాట్లాడుతూ.. ” మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్ల కంటే తెలుగు రానీ హీరోయిన్ లనే మేము ఎక్కువగా ఇష్టపడతాము” అంటూ ఎస్కేఎన్ తెలిపారు. అంతేకాదు దీనికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “దీనికి కారణం కూడా ఉంది. తెలుగు వచ్చిన అమ్మాయిలను మేము ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో అనే అనుభవం మాకు ఎదురయ్యింది. ఇకనుంచి నేను కానీ, నా డైరెక్టర్ సాయి రాజేష్ గానీ తెలుగు రాని హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలని అనుకుంటున్నాము” అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ విషయాలు వైరల్ అవ్వడంతో అందరూ యూట్యూబర్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ను ఉద్దేశించి ఎస్ కే ఎన్ ఈ కామెంట్లు చేశారని చెబుతున్నారు. ఎందుకంటే వీరి ముగ్గురు కాంబినేషన్లో ఇదివరకే ‘బేబీ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఎంత విజయం అయిందో అందరికీ తెలుసు. ఇక ఈమెను వీరు బాగా ప్రోత్సహించారు. అయితే ఇలాంటి వీరు సడన్గా తెలుగు హీరోయిన్స్ గురించి కామెంట్లు చేయడంతో.. వీరు వైష్ణవిని ఉద్దేశించే కామెంట్ చేశారా ? లేక మరెవరైనా హీరోయిన్స్ గురించి అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కాంట్రవర్సీకి తెరలేపే ఎస్కేయన్ ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ పై చేసిన కామెంట్లు సర్వత్ర వైరల్ గా మారుతున్నాయి.
వైష్ణవి చైతన్య కెరియర్..
ఇక వైష్ణవి చైతన్య విషయానికి వస్తే.. బేబీ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. కొడితే కుంభస్థలమే కొట్టాలి అనే రేంజ్ లో ఒక సినిమాతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న.. ఈ అమ్మడు అటు యూట్యూబ్లో షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువవుతోంది.
తెలుగు హీరోయిన్స్‌ను ఇక నుంచి ఎంకరేజ్ చేయం – నిర్మాత SKN #SKN #ReturnoftheDragon #KayaduLohar #BIGTVCinema @SKNonline pic.twitter.com/RvXJFMfVgv
— BIG TV Cinema (@BigtvCinema) February 17, 2025