Rajinikanth : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా అంటే చెప్పలేము.. అందం, అభినయం ఉంటే సరిపోదు. కాస్త లక్ కూడా తోడైతె మూవీలు సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి కాలు పెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది మందిలో తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన సినిమాల్లో మాత్రమే సూపర్ స్టార్ కాదు. రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్థారే.. ఇది జనాలు అంటున్న మాట.. ఇండస్ట్రీలో సాయం కోరి వస్తే తోచిన సాయాన్ని అందిస్తూ అభిమానుల మనసు దోచుకున్నాడు. తాజాగా ఓ నటి రజినీ వ్యక్తిత్వం గురించి బయటపెట్టింది. ఆమె ఏమన్నారో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
సీనియర్ నటి రమాప్రభ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. దశాబ్ద కాలం పాటు సినీ ఇండస్ట్రీలో రాణించింది. 1400 కి పైగా చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ప్రముఖ హాస్య నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రుమా ప్రభ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. లేడి కమెడియన్ గా ఆమె నటన పై ప్రశంసలు దక్కుతూనే ఉంటాయి. అంత అద్భుతంగా సినిమాలు ఉంటాయి. అందుకే అప్పటికి, ఇప్పటికి ఆమె అదే పేరును కొనసాగిస్తుంది. వయసు మీద పడటంతో సినిమాలకు దూరమైనా ఈమె ప్రస్తుతం పలు ఛానెల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సూపర్ స్టార్ రజినీ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో తలైవా ఫ్యాన్స్ ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు.
ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. రియల్ లైఫ్ లో మనసున్న బంగారం అని ఆమె అన్నారు. ఓ సందర్బంలో రజినీకాంత్ ఇంటికి వెళ్ళిన రామప్రభ పరిస్థితిని చూసిన రజిని.. అప్పటి రోజుల్లోనే తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలను ఇచ్చేసారట. ఎంతో కొంత సాయం చేస్తారని వెళ్లిన రమాప్రభకు.. రజిని ఇచ్చిన డబ్బు చాలా కష్టాల నుంచి బయటపడేసిందట. ఆమె చెప్పిన మాటలు నిజమే సాయం కోరి వెళితే రజినీ సాయాన్ని అందిస్తాడు.. అందుకే తమిళనాట దేవుడుగా భావిస్తారు. ప్రస్తుతం ఈయన వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
రమాప్రభ కెరీర్ విషయానికొస్తే.. హాస్యనటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమప్రభ ఎన్నో సినిమాలలో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడిగా నటించింది. నటుడు శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అతని వల్ల మోసపోవడమే కాకుండా.. తాను సంపాదించుకున్న ఆస్తిని మొత్తం పోగొట్టుకుందట. చివరికి కట్టుబట్టలతో రోడ్డున పడింది. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమెకు సాయంగా నిలిచారు.