Potato For Face: ప్రతి ఒక్కరూ తమ చర్మం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ముఖం మీద ముడతలు కనిపించడం ప్రారంభిస్తే.. ఈ కల అస్సలు నెరవేరదు. వయసు పెరిగే కొద్దీ ముఖం మీద ముడతలు, సన్నని గీతలు కనిపించడం సాధారణం.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా.. చాలా మందికి వారి ముఖాలపై అకాల ముడతలు రావడం ప్రారంభిస్తాయి . దీని వల్ల ముఖం నీరసంగా కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ముడతలను వదిలించుకోవడానికి వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి మీ చర్మానికి హాని కలిగిస్తాయి ఇలా జరగకుండా సహజంగానే ముడతలను వదిలించుకోవడానికి మీరు కొన్ని హోం రెమెడీస్ వాడటం మంచిది.
బంగాళదుంప రసంతో తయారు చేసిన హోం రెమెడీస్ కూడా ముడతలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బంగాళదుంప రసంలో విటమిన్ B6 , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు..చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అలాగే చర్మ రంగును మెరుగుపరచడంలో ప్రభావ వంతంగా పనిచేస్తాయి. ముడతలను తొలగించడానికి బంగాళదుంప రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప రసం, తేనె:
ముఖం మీద ముడతలు లేదా ఫైన్ లైన్స్ తొలగించడానికి.. మీరు బంగాళదుంప రసంలో తేనె కలిపి మీ ముఖానికి అప్లై చేయవచ్చు. దీని కోసం.. 2-3 చెంచాల బంగాళదుంప రసం తీసుకోండి. దానికి కొంచెం తేనె కలపండి. ఇప్పుడు దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. బంగాళదుంప రసాన్ని తేనెతో కలిపి రాసుకుంటే ముడతలు తొలగిపోతాయి. ఇది మీ చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది.
బంగాళదుంప రసం, పాలు:
మీ ముఖం మీద ముడతలు, సన్నని గీతలు ఉంటే.. మీరు బంగాళదుంప రసాన్ని పాలలో కలిపి అప్లై చేయవచ్చు. దీని కోసం.. బంగాళదుంప రసంలో పాలు, గ్లిజరిన్ వేసి కలపండి. ఇప్పుడు దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. మీరు దీనిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు మీ ముఖంపై అప్లై చేసుకోవచ్చు. బంగాళదుంప రసాన్ని పాలలో కలిపి రాసుకుంటే ముడతల సమస్య తొలగిపోతుంది.
బంగాళదుంప రసం, పసుపు:
మీ ముఖం మీద ముడతలు, సన్నని గీతలు తొలగిపోవాలంటే.. మీరు బంగాళదుంప రసంలో పసుపును కలిపి కూడా వాడవచ్చు. దీని కోసం.. 2-3 చెంచాల బంగాళదుంప రసంలో కాస్త పసుపు కలపండి. ఇప్పుడు దాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత వాష్ చేయండి. వారానికి 1-2 సార్లు బంగాళదుంప రసంలో పసుపు కలిపి ముఖానికి వాడితే.. వృద్ధాప్య సంకేతాలను వదిలించుకోవచ్చు. ఇందులోని పసుపు కూడా టానింగ్‌ను తొలగిస్తుంది.
Also Read: సమ్మర్‌లో ఫేస్‌కి ఈ ఒక్కటి వాడితే.. రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు !
బంగాళదుంప, టమాటో రసం:
వృద్ధాప్య సంకేతాలను తొలగించడానికి.. మీరు టమాటో రసాన్ని బంగాళదుంప రసంతో కలిపి అప్లై చేయవచ్చు. బంగాళదుంప రసంలో 1 టీస్పూన్ టమాటో రసం కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత వాష్ చేయండి. బంగాళదుంపలు, టమాటోల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. దీనిని బంగాళదుంప రసంతో కలిపి వాడటం వల్ల కూడా మొటిమలు తొలగిపోతాయి.