Ravi Mohan Studios Logo: నటుడు రవి మోహన్(Ravi Mohan) అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ నటుడు జయం రవి(Jayam Ravi) అంటే మాత్రం టక్కున ఈ నటుడు అందరికీ గుర్తుకు వస్తాడు. జయం రవిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ హీరో ఉన్నఫలంగా తన పేరును మార్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఈయన జయం రవిగా ఉన్న తన పేరును కాస్త రవి మోహన్ గా మార్చుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే తాను ఈ పేరు మార్చుకున్నానని క్లారిటీ ఇచ్చారు..
నిర్మాణ రంగంలోకి స్టార్ హీరో…
ఇలా పేరు మార్చుకున్న జయం రవి తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా రవి మోహన్ అని పేరు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవి మోహన్ ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈయన రవి మోహన్ స్టూడియోస్ (Ravi Mohan Studios) పేరిట కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని అధికారకంగా కూడా అందరితో పంచుకున్నారు. అయితే తాజాగా రవి మోహన్ తన ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన లోగో(Logo) విడుదల చేశారు. ఇక ఈ లోగోని ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
లోగో విడుదల చేసిన నటుడు…
ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున తన రవి మోహన్ స్టూడియోస్ కి సంబంధించిన లోగో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఎన్నో ఎగ్జైటెడ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తుంటాయి.. వేచి చూడండి అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు బెస్ట్ విషెస్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవి 2003వ సంవత్సరంలో జయం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన పేరు ముందు సినిమా పేరును పెట్టుకుని జయం రవిగా మారిపోయారు.
On this auspicious day, I’m thrilled to reveal the logo of #RaviMohanStudios !!!
Exciting updates coming your way soon…
Stay Tuned @Ravimohanstudio ✌🏻 pic.twitter.com/ACuBYeX9TR
— Ravi Mohan (@iam_RaviMohan) June 5, 2025
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉన్న జయం రవి తన వైవాహిక జీవితంలో కూడా చాలా సంతోషంగా గడిపారు. ఈయన ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకొని దాదాపు 15 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయల కారణంగా విడాకులు(Divorce) తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇలా విడాకుల తర్వాత నటుడు జయం రవి తన పేరును కాస్త రవి మోహన్ గా మార్చుకొని కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఇక ఇప్పుడు నిర్మాణ సంస్థను ప్రారంభించి ఏకంగా తన నిర్మాణ సంస్థకు రవి మోహన్ స్టూడియోస్ పేరుతో నిర్మాతగా మారి ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈయన ప్రొడక్షన్ నుంచి మొదటి సినిమాని ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.