Ramayana: ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రామాయణ తెరకెక్కుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాముడి పాత్రలోరణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. రావణాసుడిగా యష్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి.
ఇక ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ.. సన్నీ డియోల్ అధికారికంగా తాను రామాయణలో భాగం అయ్యినట్లు తెలిపాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ” రామాయణం చాలా సుదీర్ఘమైన ప్రాజెక్ట్. ఎందుకంటే వారు అవతార్ మరియు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమాలలా రామాయణాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అందులో టెక్నీషియన్స్ అందరూ భాగమే. అది ఎలా ఉండాలి, పాత్రలను ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలపై రచయిత మరియు దర్శకుడు చాలా స్పష్టంగా ఉన్నారు.
R.K. Sagar: మెగా బ్రదర్ కి డబుల్ ధమాకా.. పోస్ట్ పెట్టిన సీరియల్ నటుడు..!
ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుంది. నిజంగా రామాయణం కళ్లకు కట్టినట్లు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా యథార్థంగా జరిగిందని ప్రేక్షకులు విశ్వసించే స్పెషల్ ఎఫెక్ట్‌లను ఇందులో ఉపయోగిస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇది చాలా అద్భుతంగా ఉంటుందని మరియు ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హనుమంతుడి పాత్రలో సన్నీ నటిస్తున్నాడా.. ? లేదా.. ? అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయినా కూడా సినిమాపై అంచనాలను అయితే పెంచేశాడు.
ఇక రణబీర్ సైతం ఒక ఇంటర్వ్యూలో రామాయణ గురించి మాట్లాడాడు. నితీష్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. పార్ట్ 1 షూటింగ్ ఫైనల్ కు వచ్చింది. త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుంది. రాముడిగా నటించడం నా కల. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక సన్నీ డియోల్ గురించి అందరికీ తెల్సిందే. గతేడాది గదర్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సన్నీ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఇప్పుడు రామాయణ లో సన్నీ కీలక పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక సన్నీ తో పాటు కైక పాత్రలో లారాదత్తా నటిస్తుండగా సూర్పనఖగా రకుల్ ప్రీత్ నటిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.