Actor Sai Kumar: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య ఏదైనా.. గట్టిగా ఊపిరి పీల్చుకొని జై బాలయ్య అంటే కొండంత బలం వస్తుంది. ఇక కోపం లో డేంజర్ గా కనిపించినా బాలయ్య మనస్సు మాత్రం బంగారం. నోరు జారుతాడు కానీ, మంచి పనులు చేయడంలో ఏరోజు వెనుకాడడు. ముఖ్యంగా అభిమానులను తన సొంత ఫ్యామిలీలా చూసుకుంటాడు. ఎలాంటి కల్మషం లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతాడు. అందుకే బాలయ్య అంటే అభిమానులకు అంత ప్రాణం.
ఇక బాలయ్య సినిమా కోసం ప్రాణం ఇస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఇప్పటివరకు డూప్ ను వాడని ఏకైక హీరో అంటే బాలయ్య అనే చెప్పాలి. చాలా సినిమాల్లో ఆయన రియల్స్ స్టంట్స్ చూసి మేకర్సే ముక్కున వేలేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్ సినిమాలో కారు సీన్ చేసింది బాలయ్యనే. శ్రీయకు తెలియకుండా కారు ఎక్కించి.. విలన్స్ ఉన్న ప్లేస్ కు తీసుకెళ్లి నాలుగు రౌండ్స్ వేసి కారు ఆపేసాడు. అలా రౌండ్స్ తిప్పడం పూరి చెప్పలేదు. బాలయ్యనే రిస్క్ చేసి తిప్పేశాడట. సీన్ బాగా రావడంతో దాన్ని సినిమాలో ఉంచారు. ఆ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
బాలయ్య ఇలా డూప్ లేకుండా నటించడం ఇదే మొదటిసారి కాదు. చాలా సినిమాల్లో ఆయన ఇలాగే చేశారని నటుడు సాయి కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించిన సాయి కుమార్.. ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయవంతంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
Malavika Mohanan: సోషల్ మీడియాలో ఫేక్ ఫోటో వైరల్, స్పందించిన మాళవికా.. మరీ ఇంత దారుణమా.?
సాయి కుమార్, బాలకృష్ణ కలిసి సీమ సింహం అనే సినిమా చేశారు. ఈ సినిమాలో సాయి కుమార్ విలన్ కొడుకుగా నటిస్తాడు. బాలయ్యకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చి అతని చేతిలోనే చావు దెబ్బలు తింటాడు. ఆ యాక్షన్ సీన్ లో మొదట బాలయ్యను సాయి కుమార్ గుండెలపై తన్నే షాట్ ఉంటుంది. దాని కోసం డూప్ ను పెడతాము అంటే వద్దని బాలయ్యనే ఆ యాక్షన్ సీన్ చేసినట్లు సాయి కుమార్ తెలిపాడు.
” బాలయ్యతో ఆ సీన్ చేసేముందు డైరెక్టర్ వచ్చి ఇలా ఆయనను గుండెల మీద తన్నాలి. దానికి డూప్ ను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. నేను సరే అన్నాను. ఆ తరువాత బాలయ్య.. ఫైట్ మాస్టర్ ను సీన్ ఏంటి అని అడిగారు. సాయి గారు.. మీ గుండెల మీద తన్నుతారు.. మీరు వెనక్కి వెళ్లి పడాలి. ఆ షాట్ కోసం డూప్ ను పెట్టాం అని చెప్పాడు. దానికి బాలయ్య.. సాయి కొడితే ఆ పవర్ నాకు తెలియాలి కదా.. డూప్ ఏం వద్దు. నేను చేస్తాను అన్నారు.
ఇక నాకు టెన్షన్ మొదలయ్యింది. బాలయ్యను గుండెల మీద కొట్టడం అంటే భయమేసింది. ఎలాగోలా ఆ షాట్ ను ఫినిష్ చేశాను. నేను గుండెల మీద తన్నడం, ఆయన వెనక్కి వెళ్లి పడడం అంతా బాలయ్య డూప్ లేకుండా చేశారు. రియల్ గా చేస్తేనే ఒరిజినల్ గా కనిపిస్తుందని బాలయ్య నమ్ముతారు” అని సాయి కుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.