Samudrakhani: తమిళ నటుడు.. దర్శకుడు..గాయకుడు.. అయినటువంటి సముద్రఖని (Samudrakhani) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో, కీలకమైన పాత్రల్లో నటించారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దగ్గుబాటి రానా (Daggubati Rana) కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో రానాకి తండ్రిగా నెగిటివ్ పాత్రలో కనిపించగా.. ప్రముఖ యాంకర్ అనసూయ(Anasuya) కీ రోల్ పోషించిన ‘విమానం’ సినిమాలో తన నటనతో ఎంతోమందిని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు మధ్య అనుబంధం చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది సముద్రఖని నటనకి ఫ్యాన్స్ అయిపోయారు.
శంకర్ సినిమాలపై సముద్రఖని కామెంట్స్..
ఈ విషయం పక్కన పెడితే.. రీసెంట్ గా ఈయన ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ , కమల్ హాసన్ (Kamal hassan) ‘భారతీయుడు 2’ సినిమాల్లో నటించారు. అయితే శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలి అని గతంలో చాలా సార్లు అనుకున్నారట. కానీ తన కోరిక తీరడం లేదని ఎన్నో సందర్భాలలో అభిమానులతో చెప్పుకొని బాధపడ్డారు కూడా. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా తనకి శంకర్ అవకాశం ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారట. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెబుతూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఇది తనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటూ తెలిపారు సముద్రఖని.
నా కోరిక నెరవేరింది..
ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 సినిమాల్లో డైరెక్టర్ శంకర్ నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.ఒకప్పుడు శంకర్ సినిమాల్లో అవకాశం కోసం ఎంతగానో వేచి చూసేవాడిని. కానీ ఇప్పుడు ఆయన సినిమాలో చేసే అవకాశం రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే ఈ రెండు సినిమాల్లో శంకర్ గారు నాకోసమే కొన్ని సన్నివేశాలు రాసానని చెప్పిన సమయంలో నాకు చాలా ఆనందం కలిగింది. ఇంతకంటే నాకేం కావాలి.. ఇది నా లైఫ్ టైం అచీవ్ మెంట్ ” అంటూ సముద్రఖని తన మనసులోని మాట చెప్పారు. ఇక తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాలో ఫస్టాఫ్ లో సముద్రఖని ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో ఈయన పాత్రనే మలుపు తిప్పుతుంది. ఇక గేమ్ ఛేంజర్ చాలా అద్భుతమైన సినిమా అని , కచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని కూడా గేమ్ ఛేంజర్ పై పాజిటివ్ కామెంట్లు చేశారు సముద్రఖని. అంతేకాదు ఇన్నేళ్లు పడిన కష్టం.. అటు భారతీయుడు 2, ఇటు గేమ్ ఛేంజర్ సినిమాలలో నటించిన తర్వాత ఫలితం లభించింది అని, ఎట్టకేలకు శంకర్ సినిమాల వల్లే నా కష్టాలు తీరిపోయాయి అని కూడా ఈయన కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
సముద్రఖని తెలుగులో నటించిన చిత్రాలు..
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కోలీవుడ్ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో ఈయన చాలా చిత్రాలే నటించారు. ఇక తెలుగులో సముద్రఖని శంభో శివ శంభో, అల వైకుంఠటపురంలో,సర్కార్ వారి పాట, ఆర్ఆర్ఆర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో చేశారు. మొత్తానికైతే కోలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు.