Intinti Ramayanam Today Episode January 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని చెప్పడంతో ఆస్తి పంపకాల గురించి లాయర్ తో మాట్లాడతాలని అక్షయ్ వెళ్తాడు.. పల్లవి చిన్న పని ఉంది అత్తయ్య హాస్పిటల్ కి వెళ్దామని తీసుకెళ్తుంది. కమల్ అమ్మ ఎందుకు నేను వస్తా పద అంటాడు. లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కే తెలుస్తాయి బావ నేను అత్తయ్య ని తీసుకెళ్లి పోతాను అని అంటుంది. పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం దయాకర్ ను అక్షయ్ కి ఎదురుగా రమ్మని చెప్తుంది. దయాకర్ అక్షయ్ మాట్లాడుకోవడం పార్వతి చూసి వీరిద్దరూ ఇంత చనువుగా మాట్లాడుకుంటున్నారు ఏంటి? వీరిద్దరికీ నిజం తెలుసా అని అనుకుంటుంది. అక్షయ్ కు దయాకర్ మేనమామ అనే విషయం తెలిసిపోతుందని పార్వతి టెన్షన్ పడుతుంది. అక్షయ్ కి తెలిసే నా దగ్గర దాచి పెట్టాడా అని అనుమాన పడుతుంది. పల్లవి ప్లాన్ వర్క్ అవుట్ అయిందని పల్లవి సంతోషపడుతుంది. ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంటే డాక్టర్ కి ఫోన్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది రేపు రండి అని చెప్తుంది. పార్వతి పల్లవి ఇంటికి వెళ్లి పోతారు.. ఇక ఇంటికి వెళ్ళగానే పల్లవి సంతోషంలో మునిగి పోతుంది.. ఇక అక్షయ్ నిజం తెలుసుకొని రాజేంద్ర ప్రసాద్ ను అడగాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ఉదయం అక్షయ్ లాయర్ ను కలిసి అసలు విషయాన్నీ తెలుసుకుంటాడు. అక్షయ్ మీ నాన్న ఆల్రెడీ వీలునామా రాయించారు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు అని అంటాడు లాయర్. సగం ఆస్తి మీకు చెందేలా వీలునామా రాయించాడు మీ నాన్న. మీ నాన్నగారిని ఒకసారి అడిగి దాని మీద సంతకం పెట్టించుకుని అగ్రిమెంట్ ని క్యాన్సల్ చేయండి. నేను కొత్తగా వీలునామా రాసి తీసుకొస్తాను అని లాయర్ అంటాడు అలాగే లాయర్ గారు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. రాజేంద్రప్రసాద్ కిందికి రాగానే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్షయ అక్కడికి వస్తాడు. నాన్న నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అడుగుతాడు. మీరు నా పేరు మీదే 51% ఆస్తిని ఎందుకు వీలునామా రాయించారు నాకు తెలియాలి నాన్న అంటాడు. దానికి కమల్ కూడా షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. ఎందుకు నాన్న ఇలా చేసావని కోమలి అడుగుతుంది. నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని రాజేంద్రప్రసాద్ అంటాడు.
ఎవరు కూడా రాజేంద్రప్రసాద్ మాటను వినరు.. నువ్వు ఎందుకు ఇలా చేసావు నాన్న అని అందరూ అడుగుతారు. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం ఎవరికి సమాధానం చెప్పుకునే అవసరం నాకు లేదు అంటూ మొండిగా కూర్చుంటాడు. పార్వతి రాగానే పార్వతిని అక్షయ్ అడుగుతాడు. అసలు ఆస్తిని సగం నా పేరు మీద ఎందుకు రాస్తారు నీకు తెలుసు కదా అమ్మ నువ్వు నాకు చెప్పాల్సిందే అని అక్షయ్ అడుగుతాడు. నాకేం తెలీదురా నన్ను అడగద్దు అని పార్వతి అంటుంది. ఆస్తి గురించి నిజం నీకు తెలుసా అని నాకు అర్థం అయిపోయింది నువ్వు నా మీద ఒట్టేసి నిజం చెప్పాల్సిందే అని అంటాడు. దానికి పార్వతి నువ్వు నా కొడుకువి కాదు. మీ నాన్నగారి మొదటి భార్య కొడుకువి అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పల్లవి సంతోషంలో ఎగిరి గంతేస్తుంది. నేను నీ కొడుకు కాకపోవడమేంటమ్మా అని అక్షయ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో అక్షయ్ ని అందరూ దూరం పెడతారు. ఏం జరుగుతుందో చూడాలి..