Railway Ticket Booking Rules: సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా? రైల్వే స్టేషన్లలో పెద్ద క్యూ ఉందని ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న జనరల్ టికెట్ కు వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత రైలు ఎక్కితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంతకీ, ఆన్ లైన్ వేదికగా బుక్ చేసుకున్న జనరల్ టికెట్ కు ఎంత వ్యాలిడిటీ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్ల బుకింగ్
గతంలో జనరల్ టికెట్లను కేవలం రైల్వే స్టేషన్ లోని కౌంటర్లలో మాత్రమే కొనుగోలు చేసేవాళ్లు ప్రయాణీకులు. పెద్ద పెద్ద లైన్లు ఉన్నప్పటికీ గంటల తరబడి నిలబడి మరీ టికెట్లు తీసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు జనరల్ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. అన్‌రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్(UTS) యాప్ తో ఈజీగా జనరల్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది ఇండియన్ రైల్వే. క్యూలో నిలబడకుండానే జనరల్ టికెట్లు పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఆన్ లైన్ టికెట్లకు వ్యాలిడిటీ
ఇక ఆన్ లైన్ లో జనరల్ టికెట్లు తీసుకున్న వారికి రైల్వేశాఖ కొన్ని నింబధనలు పెట్టింది. వాటిని ఎంత సేపట్లో ఉపయోగించాలో చెప్తూ కొన్ని గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్ రైల్స్ ప్రకారం 3 గంటలు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఆన్ లైన్ లో టికెట్ తీసుకున్న తర్వాత 3 గంటల వరకు రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అనివార్య కారణాలతో 3 గంటల్లోగా రైలు ఎక్కకపోతే, ఆ టికెట్ చెల్లనిదిగా రైల్వే అధికారులు గుర్తిస్తారు. మీరు గమనించకుండా అలాగే రైలు ఎక్కితే, ఫైన్ కట్టక తప్పదు. ఒకవేళ వ్యాలిడిటీ లేని టికెట్ తో రైల్లోకి ఎక్కితే టీసీ ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.
Read Also: ఊపందుకున్న పండుగ ప్రయాణాలు, రైల్వే స్టేషన్లలో జనజాతర, కిక్కిరిసిన ట్రైన్లు!
ఎంత ఫైన్ కట్టాల్సి ఉంటుందంటే?
వ్యాలిడిటీ లేని ఆన్ లైన్ జనరల్ టికెట్ తో రైలు ఎక్కితే టీసీ రూ.250 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి మీరు దిగాల్సిన స్టేషన్ వరకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా వసూళు చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం అనేది క్యూ లైన్లలో నిలబడే బాధను తప్పిస్తుంది. అయితే, వ్యాలిడిటీ అనేది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వ్యాలిడిటీ లోగా రైలు ప్రయాణం చేయడం ఉత్తమం. ఒకవేళ టైమ్ దాటిన తర్వాత రైలు ఎక్కితే టికెట్ లేని వారితో సమానంగా మిమ్మల్ని భావించే అవకాశం ఉంటుంది.
Read Also: మళ్లీ తత్కాల్ బుకింగ్ టైమ్ లో IRCTC సైట్ క్రాష్, సంక్రాంతి వేళ పెద్ద స్కామ్?