BigTV English

Siddharth Comments on Animal Movie: రూ.900 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాపై నటుడు సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!

Siddharth Comments on Animal Movie: రూ.900 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాపై నటుడు సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు!

Siddharth Comments on Ranbir Kapoor’s Animal Movie: గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ హీరో రణ‌బీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులతో పాటు ఎంతో మంది నటీ నటులు కూడా ఈ సినిమాను విమర్శించారు.


ఈ విమర్శలకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ వచ్చాడు. అయితే తాజాగా మరో నటుడు ఈ యానిమల్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటుడు సిద్ధార్థ్ తాజాగా జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ వేడుకలో అతడు మాట్లాడుతూ.. ‘‘యానిమల్ (జంతువు) పేరుతో తీసిన చిత్రాన్ని వెళ్లి చూస్తారు.. కానీ నా సినిమాను చూసి చాలా మంది ఇబ్బంది అంటున్నారు’’ అని అన్నాడు.

ఈ మేరకు తాను నటించిన ‘చిత్త (చిన్న)’ సినిమాకు గానూ సిద్ధార్థ్‌కు ఓ సంస్థ అవార్డును అందజేసింది. ఇందులో భాగంగా అతడు మాట్లాడాడు. దర్శకుడు అరుణ్ తన వద్దకు వచ్చి ‘చిన్నా’ సినిమా కథ చెప్పగానే వినలేకపోయాను. చాలా బాధించింది అన్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూసిన ఏ ఒక్క అమ్మాయి కూడా అందులోని సన్నివేశాలు చూసి నేను కన్నుమూశాను అని అనలేదు. కానీ చాలా మంది పురుషులు.. ఈ సినిమాని మగవాళ్లు చూడలేరని చెప్పారని అన్నాడు.


Also Read: ప్రియుడితో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లికి ముందే ఏంటా పని.. వీడియో వైరల్

అలాంటి సినిమాను తాము చూడమని అన్నారని చెప్పాడు. అయితే వారు వెళ్లి యానిమల్ సినిమాను చూశారని.. కానీ తన సినిమాను చూసి వాళ్లు కంగారుపడ్డారని అన్నాడు. అయితే ఇది ఆందోళన కాదని.. ఇది చాలా అవమానమని.. అంతకు మించిన అపరాధమని అన్నాడు. కానీ ఏం పర్వాలేదు.. త్వరలోనే ఇదంతా బాగుపడుతుంది అంటూ ఆ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. దీంతో అతడు మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×