BigTV English

Sudigali Sudheer: వామ్మో.. సుధీర్ అంత సంపాదించాడా.. మూడు ఇళ్లు.. నిజాలు బయటపెట్టిన స్టార్ కమెడియన్

Sudigali Sudheer: వామ్మో.. సుధీర్ అంత సంపాదించాడా.. మూడు ఇళ్లు.. నిజాలు బయటపెట్టిన స్టార్ కమెడియన్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. బుల్లితెర మెగాస్టార్ అని చెప్పొచ్చ. హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్  సుధీర్ కు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.  ఒక సాధారణ కమెడియన్ గా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన  సుధీర్.. నెమ్మదిగా  తన  టాలెంట్ తో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.  అలా  బుల్లితెర నుంచి వెండితెరకు కూడా పరిచయమయ్యాడు. సుధీర్  హీరోగా తెరకెక్కిన గాలోడు సినిమా  మంచి హిట్ ను అందుకుంది.  ఈ సినిమా తరువాత కాలింగ్ సహస్ర సినిమ రిలీజ్ అయ్యింది కానీ.. అది థియేటర్ లో అంతగా ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఈ రెండు సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు  అనుకున్నారు అందరు. ఆ సినిమాలు ఇచ్చిన నమ్మకంతోనే గోట్ అనే సినిమాను ప్రకటించాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యాచిలర్ భామ దివ్య భారతి తెలుగుకు పరిచయమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈలోపే ఈ సినిమా బడ్జెట్ సమస్యలను ఎదుర్కుంటూ ఆగిపోయింది. దీంతో సుధీర్ బ్యాక్ టూ టీవీ అంటూ వచ్చేశాడు.

ప్రస్తుతం వరుస షోస్ లతో బిజీగా ఉన్న సుధీర్.. ఇప్పటివరకు బాగానే సంపాదించాడట. సుధీర్ పేరు మీద ఇప్పటివరకు మూడు ఇళ్లు ఉన్నాయట. ఈ విషయాన్నీ మరో కమెడియన్ శివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సుడిగాలి సుధీర్ మొదట ప్లాట్.. తన దగ్గరనే కొన్నాడని, కొన్ని అప్పులు ఉండడం వలన తక్కువ ధరకే అమ్మినట్లు చెప్పుకొచ్చాడు. సుధీర్ కావాలని పట్టుబట్టి ఆ ఇల్లు తీసుకున్నట్లు కూడా తెలిపాడు.


Anil Ravipudi: అనిల్ రావిపూడి రియల్ లవ్ స్టోరీ.. భార్య ఫ్రెండ్ ను ప్రేమించి.. చివరకు

” చాలామంది  శివారెడ్డికి ఏంటి పెద్ద ఇల్లు ఉంది అని అంటారు. ఇండస్ట్రీలో ఏ కమెడియన్ కు ఇల్లు లేదు చెప్పండి. అందరికీ రెండేసి, మూడేసి ప్లాట్స్ ఉన్నాయి. నా దగ్గర ఇల్లు కొనుకున్న సుడిగాలి సుధీర్ కు కూడా మూడు ప్లాట్స్ ఉన్నాయి. నాకు తెలిసి మూడు  ఉన్నాయి.. తెలియకుండా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. మొదటి ప్లాట్ మాత్రం నా దగ్గరే కొన్నాడు. చాలా తక్కువ ధరకే ఇచ్చాను. నేను చేయించిన ఇంటీరియర్ నచ్చి నన్ను అడిగాడు.. నేను కొంటాను అన్న అని.

ఆ ఇంటీరియర్ ఏంటి అంటే.. నాకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ పెట్టుకోవడానికి హాల్ లో నా పేరు వచ్చేలా S అనే లెటర్ తో ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నాను. అది సుధీర్ కు బాగా నచ్చింది. అతని పేరు కూడా అదే లెటర్ తో స్టార్ట్ అవుతుండడంతో సుధీర్  తీసుకున్నాడు. ఈ ప్లాట్ కాకుండా అతనికి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఇలా ఒకరిని కాదు..బలగం సినిమా కన్నా ముందే వేణు నాలుగు అంతస్తుల ఇల్లు కట్టాడు. అందరూ ఇప్పుడు సొంత ఇళ్లలో ఉండేవారే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. సుధీర్ బాగా గట్టిగానే సంపాదించాడే అని నోళ్లు నొక్కుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×