BigTV English
Advertisement

Sivaji Raja : బండ్ల గణేష్ ఓ తుత్తర క్యాండిడేట్… ఆ రోజు కర్రతో కొడితే పారిపోయాడు.!

Sivaji Raja : బండ్ల గణేష్ ఓ తుత్తర క్యాండిడేట్… ఆ రోజు కర్రతో కొడితే పారిపోయాడు.!

Sivaji Raja :శివాజీ రాజా(Sivaji Raja).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన తెలుగు సినిమా నటుడు కూడా.. 1985లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన దాదాపు 260 కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ఎం.వి రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన ‘కళ్ళు’ అనే నాటిక ఆధారంగా రూపొందిన ‘కళ్ళు’అనే చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ రాజా.. ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఇక తర్వాత సిసింద్రీ ,శంకర్ దాదా ఎంబిబిఎస్, ఘటోత్కచుడు, పెళ్లి సందడి, మురారి వంటి ఎన్నో చెప్పుకోదగ్గ చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక ‘అమృతం’ సీరియల్ లో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర పోషించిన ఈయన మరో టీవీ ఛానెల్ లో కొంతకాలం పాటు ప్రసారం అయిన ‘సంబరాల రాంబాబు’ అనే సీరియల్ లో కూడా నటించారు. ఇక ప్రస్తుతం సినిమా రంగంతోపాటు టీవీ రంగంలో కూడా కొనసాగుతున్నారు.


బండ్ల గణేష్ తుత్తర క్యాండిడేట్ – శివాజీ రాజా

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ రాజా ప్రముఖ నిర్మాత, నటుడు, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శివాజీ రాజా మాట్లాడుతూ..” ప్రతి ఒక్కరి పైన ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. అలాగే బండ్ల గణేష్ పైన మాకు తుత్తర క్యాండిడేట్ అనే అభిప్రాయం ఉంది. బండ్ల గణేష్ నాకంటే వయసులో దాదాపు 12 సంవత్సరాల చిన్నవాడు. వాడిని నేను గని అని పిలిస్తే, నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. ఇప్పటికీ కూడా అదే చనువు వుంది. బండ్ల గణేష్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే తుత్తర పనులు చేసేవాడో.. ఇప్పుడు కూడా అలాంటి పనులు చేస్తున్నాడు. వాడు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే వాడు మా దగ్గర చిన్నవాడే కదా. ఎక్కువగా అప్పట్లో చాడీలు చెప్పేవాడు. నేను, శ్రీకాంత్ కలిసి సరదాగా ఒక రోజు బయటకు వెళ్ళాము. అయితే ఆరోజు మేము తాగి ఇంటికి వస్తే శ్రీకాంత్ ని మాత్రమే పిలిచి, ఏం జరిగిందో తెలుసుకొని ఇంట్లో నాన్నకు చెప్పారు. ఇక ఆ నిజం మాకు తెలిసి, ఒకరోజు కర్ర తీసుకొని మరి బండ్ల గణేష్ ను గదిలో వేసి చితక బాదాను.. అప్పట్లో ఇలాంటివి వాడు ఎన్నో చేసేవాడు. ముఖ్యంగా వాడి గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అన్ని విషయాలలో తుత్తర ఎక్కువ అంటూ బండ్ల గణేష్ పై కామెంట్ చేశారు శివాజీ రాజా.


వాడు చేసిన పనికి నా అభిప్రాయం మారిపోయింది – శివాజీ

అందుకే వాడు తుత్తర క్యాండిడేట్ అని వాడితో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉండేవాడిని.. అయితే ఒకరోజు వాడు చేసిన పనికి, వాడిపైన నా అభిప్రాయం మారిపోయింది. నేను చేయాలనుకున్న పనిని వాడు చేసి చూపించాడు. ఒక నేపాలి అమ్మాయిని దత్తత తీసుకొని మంచి మనసు చాటుకున్నాడు. సమయం దొరికితే చాలు ఆ అమ్మాయితో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ.. ఆ పాప కోసమే ఎన్నో త్యాగాలు కూడా చేశారు. ఇక వాడి మంచి మనసుకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే” అంటూ బండ్ల గణేష్ క్యారెక్టర్ తో పాటు మంచి వ్యక్తిత్వంపై కూడా కామెంట్ చేశారు శివాజీ రాజా. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Varun – Lavanya: ఇట్స్ అఫిషియల్… తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్ -లావణ్య.. పోస్ట్ వైరల్..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×