BigTV English

Srisudha: డాక్టర్ కం యాక్టర్.. లైంగిక వేధింపులు మాత్రం తప్పలేదంటూ నటి ఆవేదన..!

Srisudha: డాక్టర్ కం యాక్టర్.. లైంగిక వేధింపులు మాత్రం తప్పలేదంటూ నటి ఆవేదన..!

Srisudha:సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరూ చెడ్డవాళ్ళు కాదు అలాగని అందరూ మంచివాళ్ళు కూడా కాదని.. బాధిత నటీనటులు చెబుతూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లను తమ సొంత అక్క చెల్లెళ్లు గానే భావిస్తారు. కానీ చాలామంది అవకాశాల కోసం వచ్చిన వారిని ఏదో ఒక విధంగా వాడుకోవాలని చూస్తారు. అయితే అలాంటి వారి గురించే ఈనటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ డాక్టర్ కం నటి శ్రీసుధ.. ఈ నటి డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాక సినిమాల్లోకి వచ్చింది. అలా శ్రీ సుధా అర్జున్ రెడ్డి, దమ్ము,బాడీగార్డ్, సరిలేరు నీకెవ్వరు, వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి, రూలర్, అవును వంటి సినిమాల్లో నటించింది. నటిగా తానేంటో నిరూపించుకున్న శ్రీ సుధ, ఇండస్ట్రీలో ఉండే ఓ ఇద్దరి కారణంగా టార్చర్ అనుభవించిందట. మరి ఆ ఇద్దరు ఎవరు..? నిజంగానే శ్రీసుధని వాళ్ళు టార్చర్ చేశారా? అనేది ఇప్పుడు చూద్దాం.


శ్యామ్ కే నాయుడు వాడుకొని వదిలేసాడంటున్న నటి..

సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్నా చోటా.కె. నాయుడు అంటే చాలామందికి తెలుసు. అయితే తెరవెనక పని చేసే సినిమాటోగ్రాఫర్ ల గురించి ఎక్కువ మందికి తెలియదు.కానీ చోటా.కె. నాయుడు అంటే అందరికీ సుపరిచితమైన వ్యక్తి. చోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కే నాయుడుకి కూడా ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే అలాంటి శ్యామ్.కె. నాయుడు పై చాలా రోజుల నుండి న్యాయ పోరాటం చేస్తోంది నటి శ్రీ సుధ. ఎందుకంటే శ్యామ్.కే. నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెబుతూ శ్రీ సుధ ఇప్పటికి ఆయనపై న్యాయపోరాటం చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీ సుధ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.శ్రీ సుధ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి నేను ఎన్నో కలలు కని వచ్చాను. అనుకున్నట్టుగానే నా కలలన్నీ నెరవేరాయి. కానీ శ్యామ్.కె.నాయుడు వల్ల నా జీవితం నాశనం అయింది.ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పూర్తిగా వాడుకున్నాడు. కానీ చివరికి పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు. అందుకే ఇప్పటికి కూడా రాజీ పడకుండా నేను శ్యామ్. కే. నాయుడి పై ఫైట్ చేస్తున్నాను. నేను ఆయనపై కేసు పెట్టిన సమయంలో ఇండస్ట్రీ నుండి చాలామంది పెద్దవాళ్లు నాకు ఫోన్ చేసి కేసుని వెనక్కి తీసుకోవాలి అని ఒత్తిడి చేశారు. కానీ నేను ఎవరికి భయపడలేదు. నటిగా నాకు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. ఉదయాన్నే 6 గంటలకు షూటింగ్ కి వెళ్లేదాన్ని. కానీ శ్యామ్ కె నాయుడు మాత్రం అర్ధరాత్రి 2,3 అయ్యే వరకు కూడా తన గోలతో నన్ను టార్చర్ చేసేవాడు.మళ్లీ ఉదయాన్నే రాత్రంతా ఏమీ జరగనట్టు ప్రవర్తించేవాడు.


తమ్ముడితో సమస్య..నాకేంటంటున్న అన్నయ్య..

కానీ ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక ఆయన చేసిన గొడవ అంతా అర్ధరాత్రి నేను ఫోన్ లో రికార్డ్ చేశాను. అయితే అప్పుడు చేసిన రికార్డులు ఇప్పుడు నాకు ఎంతగానో యూస్ అవుతున్నాయి.ఇక శ్యామ్. కె. నాయుడు టార్చర్ తట్టుకోలేక ఆయన అన్న చోటా. కె. నాయుడుకు చెబుదామని ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్లాను.జరిగిన విషయం మొత్తం చెప్పాను. కానీ చోటా.కె.నాయుడు మాత్రం నా బాధంతా విన్నాక నా తమ్ముడితో నీకు జరిగిన ఇష్యూ సెటిల్ చేస్తాను. కానీ అలా చేస్తే నాకేంటి అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. ఆయన మాటలకు ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం అవ్వలేదు.. అంటూ నటి శ్రీ సుధ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామ్. కె. నాయుడు, చోటా.కె.నాయుడి ల నిజస్వరూపాన్ని బయటపెట్టింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శ్రీ సుధా..

ఇక శ్రీ సుధ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే శ్రీ సుధ తనకి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే బయటపెడుతుంది. ఆ మధ్యకాలంలో విమానంలో జర్నీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, అక్కడే చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టింది.ఇక అప్పట్లో ఈ విషయం తెగ వైరల్ అయింది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×