Teak Wood: సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కొంచెం అవకాశమున్నా అక్రమాలకు పాల్పడుతున్నారు. దొరికనంతా దోచుకుంటున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా వసూళ్ల పర్వం పడుతున్నారు. యువతకు రోల్ మోడల్ గా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు డబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా ఎస్సారెస్సీ రెవిన్యూ అధికారులు టేకు దొంగలుగా మారారు. ఎలాంటి అనుమతి లేకుండా టేకు చెట్లను నరికివేస్తున్నారు. ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ఎలాంటి గుట్టు చప్పుడు లేకుండా టేకు చెట్లను నరికి దొంగలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రక్షించాల్సిన అధికారులు భక్షించడమేంటని పలువురు నిలదీస్తున్నారు. కార్యాలయం లోపల టేకు చెట్లను నరికి దొంగలించి గదిలో భద్రపరిచారు. అంతేగాకుండా మొదలు భాగం కనబడకుండా మోరం కప్పే ప్రయత్న చేస్తున్నారు.
అయితే.. మీడియా ప్రతినిధులను చూడగానే స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ అయిన అజయ్ కుమార్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ఈ టేకు చెట్ల దొంగతనానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయింపు చర్యలకు పాల్పడ్డాడు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయానికి చేరుకుని.. కార్యాలయం తలుపులు బద్దలు గొట్టి టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 టేకు దుంగలను గుర్తించి నెంబరింగ్ వేసి పంచనామా చేశారు. అక్రమాలకు పాల్పడిన ఈ రెవిన్యూ అధికారులపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Jobs In CISF: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. లాస్ట్ డేట్ ఇదే..
నిజాయితీ ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా అవినీతికి పాల్పడడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇలాంటి అవినీతి పనులకు పాల్పడే అధికారులను వెంటనే సస్సెండ్ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి పనులకు పాల్పడే అధికారులు బుద్ది తెచ్చుకోవాలని తిట్టిపోస్తున్నారు.