Actor Suresh: సీనియర్ హీరో సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. తెలుగువాడు కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులు ఆయనను ఎంతో ఆదరించారు. పుట్టింటి పట్టుచీర అనే సినిమాతో సురేష్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఇనియర్ హీరోల సినిమాల్లో కొడుకుగా, తమ్ముడిగా నటిస్తూనే హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సూరిగాడు, అమ్మోరు, దొంగాట, దేవి పుత్రుడు లాంటి సినిమాలు సురేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి.
దాదాపు 274 సినిమాల్లో నటించిన సురేష్.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటాడు. మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం లాంటి సీరియల్స్ ను నిర్మించాడు. మరికొన్ని సీరియల్స్ లో నటించాడు. ఇక గత కొంతకాలం నుంచి సురేష్ తన ఆరోగ్యంపై ఫోకస్ పెడుతున్నాడు. అంతకుముందు బరువు పెరిగి కనిపించిన ఆయన.. ఇప్పుడు బక్కచిక్కి కనిపిస్తున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం వలన తాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పుకొస్తున్నాడు.
Pushpa 2: సంక్రాంతి బరిలో మళ్లీ దిగుతున్న పుష్ప.. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటో.. ?
ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సురేష్ తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. అప్పట్లో తనతో పాటు నటించిన హీరోయిన్స్ తో చాలామంది తనతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నదియా ఒకరు. తెలుగువారికి నదియా ఎవరు అన్నది పరిచయం చేయనవసరం లేదు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ లతో నటించిన ఈ చిన్నది.. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మిర్చి సినిమాతో తెలుగుతెరకు రీఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ కు తల్లిగా కనిపించి మెప్పించింది.
ఇక మిర్చి తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కు అత్తగా నట విశ్వరూపం చూపించింది. ఇక ఈ సినిమా తరువాత ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నదియా .. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Garikipati Narasimha Rao: గరికపాటి ఒక నీచుడు.. వదినపై కన్నేసి.. లాకెళ్లి మెడలో తాళి కట్టి..
ఇక ఆ సమయంలో నదియా ఎలా ఉండేది అనే దాని గురించి సురేష్ మాట్లాడుతూ.. ” నదియాతో నేను చాలా సినిమాలు చేశాను. ఆమె నాతో మంచిగా మాట్లాడేది. ఇక ఆమె ప్రేమించిన అబ్బాయి పేరు శిరీష్ .. నా పేరు సురేష్. ఇద్దరు పేర్లు పలకడానికి ఒకేలా ఉండడంతో సెట్ లో అందరు ఆమె నాతోనే మాట్లాడుతుంది అనుకునేవారు. మేము ఇద్దరం ప్రేమలో ఉన్నామని పొరపాటు పడ్డారు. కానీ, నదియా నాకు చెల్లి లాంటిది. అందుకే మేము రొమాన్స్ చేయలేకపోయాము.
నదియా చాలా స్ట్రాంగ్. ఎప్పటివరకు ఇండస్ట్రీలో ఉండాలి. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అనిఅన్ని ప్లాన్ చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం. మాకు వాట్సప్ లో ఒక గ్రూప్ కూడా ఉంది” అని సురేష్ చెప్పుకొచ్చాడు. [రాస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.