Janasena Party: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనకు మాజీ సీఎం జగన్ కారణమని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన ఇద్దరు యువకుల మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భాద్యత వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తున్న సంధర్భంగా కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు.
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరై వెనుతిరిగి వెళ్తూ, ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన వ్యాఖ్యలే కారణమని వైసీపీ విమర్శిస్తోంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, దిల్ రాజులు ఒక్కొక్కరు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా వైసీపీ విమర్శల పదును పెంచి, పవన్ పై నేరుగా ఎక్కుపెట్టిందని చెప్పవచ్చు.
దీనితో తిరుపతిలో కిరణ్ రాయల్ వైసీపీని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని అభిమానులకు పవన్ కళ్యాణ్ 50 సార్లు చెప్పారన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, ఆ యువకులు మృతి చెందడం తనకు కూడ భాదగా ఉందన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మాత్రం రహదారి అధ్వాన్నంగా ఉండడమేనన్న కిరణ్ రాయల్,
ఏపీలో ఇంకా కొన్ని దరిద్రపు రోడ్లు అలానే ఉన్నాయన్నారు. రోడ్లు మరమ్మత్తులకు గురై, అర్థరాత్రి సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్నారు. చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో మాజీ సీఎం జగన్ ఆడుకున్నారని విమర్శించారు.
Also Read: Viral News: బిచ్చగాడితో లవ్.. ఆరుగురు పిల్లల తల్లి జంప్..
అయితే ఇక్కడే కిరణ్ రాయల్ మరో కీలక కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ వివేకా హత్య కేసు గురించి రాయల్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఇంట్లో హత్యకు గురైన బాబాయి కేసు సంగతి ఏమైందని, ముందు ఆ కేసు నిందితులను పట్టుకొని ఆ తర్వాత తమ గురించి మాట్లాడండి అంటూ వైసీపీని ఉద్దేశించి అన్నారు. మృతి చెందిన యువకుల కుటుంబాలకు అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన కిరణ్ రాయల్, ఇలాంటి రాజకీయాలు ఇప్పటికైనా వైసీపీ మానుకోవాలని డిమాండ్ చేశారు.
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని అభిమానులకు పవన్ కళ్యాణ్ 50 సార్లు చెప్పారు
ఏపీలో ఇంకా కొన్ని దరిద్రపు రోడ్లు అలానే ఉన్నాయి
రోడ్లు భలేకే అర్థరాత్రి సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు
చెత్త రోడ్లు వేసి ప్రజల ప్రాణాలతో జగన్… pic.twitter.com/aw7tB8Yht9
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025