Pranav Mohanlal : స్టార్ కిడ్స్ అనగానే విలాసవంతమైన బంగ్లాలో నివాసం ఉండడం, ఖరీదైన కార్లలో తిరగడం వంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టడానికి రంగంలోకి దిగుతారు. మరికొంత మంది మాత్రం తమ అభిరుచి మేరకు నచ్చిన పని చేస్తారు. కానీ తాజాగా మోహన్ లాల్ (Mohanlal) తనయుడు, ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) మాత్రం సినిమాలను పక్కన పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కుమారుడు, నటుడు ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) స్పెయిన్‌లోని వ్యవసాయ క్షేత్రంలో జీతం లేకుండా పని చేస్తున్నారని అతని తల్లి సుచిత్ర మోహన్‌లాల్ తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ పంచుకున్నారు. తన కుమారుడిని ప్రణవ్ అని కాకుండా ఆవిడ ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు.
ఇంటర్వ్యూలో సుచిత్ర (Suchitra Mohanlal) మాట్లాడుతూ “ప్రణవ్ (Pranav Mohanlal) (అప్పు), ఇప్పుడు స్పెయిన్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నాడు. ఇందుకుగానూ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. ప్రతిఫలంగా అతను ఉండడానికి కాసింత చోటు, తినడానికి ఆహారం పొందుతాడు. కొన్నిసార్లు అతను గుర్రాలు, మేకలను కూడా చూసుకుంటాడు. ఇది అతనికి ఒక కొత్త అనుభవం. ఇలా ప్రణవ్ కు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన ట్రిప్ పూర్తయ్యాక, ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే ఆ అనుభవాన్ని నాతో పంచుకుంటాడు. ఆయన ఏడాదికి రెండు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కానీ ప్రణవ్ మాత్రం రెండేళ్లకు ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నాడు” అంటూ కొడుకు సినిమాలు ఎందుకు తక్కువగా చేస్తున్నాడో చెప్పుకొచ్చారు.
ఇక స్టార్ కిడ్ ఎవరైనా ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇస్తే, తండ్రీకొడులు కలిసి ఓకే ఫ్రేమ్ లో కన్పిస్తే చూడాలని అభిమానులు కోరికను వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణం. అంతేకాకుండా తండ్రీ కొడుకులతో కలిసి ఎవరైనా మేకర్ ఓ మూవీని ప్లాన్ చేస్తే వాళ్ళకు ఫుల్ మీల్స్ దొరికినట్టే. కానీ సుచిత్ర మాత్రం మోహన్ లాల్, ప్రణవ్ (Pranav Mohanlal) కలిసి సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పి షాక్ ఇచ్చారు.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ “నా భర్త, కొడుకు కలిసి నటించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నటనలో ఎవరు బెస్ట్ అనే పోలికలు వస్తాయేమోనని ఆందోళనగా ఉంటుంది. ఇక సినిమాల ఎంపికలో నేను కథలు మాత్రమే వింటాను. ఏ సినిమా చేయాలి అన్నది పూర్తిగా ప్రణవ్ (Pranav Mohanlal) ఇష్టం. అతనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు’’ అని అన్నారు సుచిత్రా మోహన్ లాల్.
ఇదిలా ఉండగా ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత 2015లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన నటించిన ఫస్ట్ మూవీ ‘ఆది’ 2018లో విడుదలైంది. 2022లో ‘హృదయం’, గత ఏప్రిల్‌లో ‘వర్షనాడు శేషం’ అనే సినిమాలు కూడా విడుదలయ్యాయి.