BigTV English

Actor Trisha : త్రిషపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన నటుడు.. సంచలనంగా మారిన కామెంట్స్..

Actor Trisha : త్రిషపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన నటుడు.. సంచలనంగా మారిన కామెంట్స్..
Actor Trisha

Actor Trisha : సుదీర్ఘకాలంగా అందానికి..నటనకి..హావభావాలకు కేరాఫ్ అడ్రస్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ హీరోయిన్ త్రిష. ఎన్నో గ్లామరస్ పాత్రలు చేసి కుర్ర కారు మది దోచిన త్రిష.. అంతకంటే ధీటుగా సీరియస్ రోల్స్ లో కూడా నటించింది. చాలా తక్కువ సమయంలోనే కెరీర్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషల్లోనూ హీరోయిన్గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.


ప్రస్తుతం వరుస ఆఫర్లతో సత్తా చాటుతూ ముందుకు వెళుతున్న త్రిష.. ఇటీవల విజయ్ తో ‘లియో’ మూవీ లో నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ లో త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష పెట్టిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మసూద్ అలీ ఖాన్ వీడియో తో పాటుగా త్రిష తన స్టైల్ కౌంటర్ కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇళయదళపతి విజయ్, త్రిష కాంబోలో లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన లియో మూవీ ఏకంగా రూ. 600 కోట్లు గ్రాస్ రాబడి వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.అయితే ఇదే సినిమాలో నటించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్, మూవీ సక్సెస్ ను పురస్కరించుకొని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మూవీలో తన పాత్ర గురించి మాట్లాడుతూ త్రిషపై అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘త్రిషతో నటిస్తున్నాను అని వెళ్ళినప్పుడు మూవీలో కచ్చితంగా ఒక బెడ్ రూమ్ సీనైనా ఉంటుందని భావించాను. ఆమెను చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి తీసుకువెళ్లే సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. గతంలో చాలా సినిమాలలో ఇలాంటి రేప్ సీన్స్ నేను చేశాను. అయితే లియో కాశ్మీర్ షెడ్యూల్‌లో త్రిష కనిపించకపోవడం తో బాగా డిసప్పాయింట్ అయ్యాను..’ అని మన్సూర్ అన్నాడు.


దీనికి ఘాటుగా స్పందించిన త్రిష..మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఇటీవలి నా దృష్టికి వచ్చింది. అతని మాటల్లో ఒక సెక్సిస్ట్.. స్త్రీలపై గౌరవం లేని ఒక స్త్రీ ద్వేషి కనిపిస్తున్నాడు. అతని వ్యాఖ్యాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి నీచమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడం నిజంగా నా అదృష్టం. ఇక భవిష్యత్తులో కూడా అతనితో ఎటువంటి సినిమా లలో చేయకుండా జాగ్రత్త పడతాను.’ అని అంది.

మన్సూర్ వ్యాఖ్యలకు మూవీ డైరెక్టర్ లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు..’మన్సూర్ మాట్లాడిన మాటలు నాకు కోపాన్ని కలిగించాయి. మేమంతా ఒక మంచి టీం గా పని చేసాము. తోటి కళాకారుల పట్ల మహిళల పట్ల ఎప్పుడు మా టీం సభ్యులు గౌరవంగా వ్యవహరిస్తారు. ఏ పరిశ్రమలు అయినా ఇటువంటి కట్టుబాటు కచ్చితంగా ఉండాలి. అతను చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని అన్నారు. లోకేష్ తో పాటు తమిళ్ ఇండస్ట్రీ లో పలువురు మన్సూర్ వ్యాఖ్యల పై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×