
IND vs AUS Final : ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఐదు విషయాల్లో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని సీనియర్లు చెబుతున్నారు.
ఆ పాంచ్ పటాకాని అధిగమిస్తే, తిరుగుండదని అంటున్నారు. అంతేకాదు ఆస్ట్రేలియా ఇంతకుముందంతా స్ట్రాంగ్ గా లేదని అంటున్నారు. ఈసారి వరల్డ్ కప్ లో పాల్గొన్న 10 టీమ్ ల్లో సగం టీమ్ లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాయి.
కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు ఆస్ట్రేలియా ఫైనల్ వరకు వచ్చింది. టీమ్ ఇండియా ఒక్కటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండి, ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఐదు అంశాల్లో టీమ్ ఇండియా కరెక్టుగా స్టెప్పులేస్తే, తిరుగుండదని చెబుతున్నారు. మరి అవేమిటో ఒకసారి చూద్దాం..
మొదటిది : ఎప్పటిలాగే రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాలివ్వాలి. మిడిలార్డర్ మీద ఒత్తిడి పడకుండా చూడాలి. అతనికి సపోర్ట్ గా శుభ్ మన్ గిల్ నిలబడాలి. పవర్ ప్లే లో రోహిత్ శర్మ తన పవరేమిటో చూపించాలి.
రెండవది : టాస్ ఎటు పడుతుందో చెప్పలేం కాబట్టి, ఒకవేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే పవర్ ప్లేలో అవుట్ కాకుండా ఆడాలి. కనీసం 90 పరుగులపైనే చేయాలి.
ఒకవేళ టాస్ ఓడి బౌలింగ్ చేయాల్సి వస్తే..ఇదే పది ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ లను అవుట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాళ్లిద్దరూ స్టాండ్ అయితే, మిడిలార్డర్ లో వచ్చే మ్యాక్స్ వెల్ లాంటోళ్లు దంచి కొట్టేస్తారు.
మూడోది: టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ కంచుకోటలా ఉంది. ఒకరి తర్వాత ఒకరు విజృంభించి ఆడుతున్నారు. ఏ రెండు వికెట్లు పడినా తొందరపడి మూడోవాళ్లు వికెట్ పారేసుకోకూడదు. చివరి వరకు ఆడాలి. ఆఖర్లో డెత్ ఓవర్లలో విజృంభించాలి.
లీగ్ మ్యాచ్ లో ఇదే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను మరిచిపోకూడదు. అప్పుడు కూడా 3 ఓవర్లలో ఓవర్ కి ఒక వికెట్ చొప్పున టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్, శ్రేయాస్, ఇషాన్ టపీటపీమని అవుట్ అయిపోయారు. అప్పటికి 2 పరుగులకి 3 వికెట్లు మీద స్కోరు బోర్డు ఉంది.
ఈ దశలో వచ్చిన కొహ్లీ, రాహుల్ ఇద్దరూ నిలబెట్టేశారు. అలాగే ఆడాలి. అందరూ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉండటమే అందుకు కారణం.
నాలుగోది: ఆస్ట్రేలియా బౌలింగ్ చేసేటప్పుడు మొదటి ఓవర్ నుంచి వికెట్ అటాకింగ్ చేస్తోంది. అంటే మొదట్లోనే టపటపా వికెట్లు తీయాలని చూస్తోంది. సెమీస్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అదే జరిగింది. వాళ్లు 24 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి..మళ్లీ కోలుకోలేదు. అది మనోళ్లు గమనించి అనవసరంగా వికెట్లు పారేసుకోకూడదు. 10 ఓవర్ల వరకు ఓపెనర్లు ఆడితే, 350 టార్గెట్ అయినా ఇవ్వవచ్చునని అంటున్నారు.
ఐదోది: డెత్ ఓవర్లలో టీమ్ ఇండియా పేస్ త్రయం ప్రత్యర్థి జట్టు పరుగులను నియంత్రించాలి. క్రమం తప్పకుండా వికెట్లు తీయాలి. ఎందుకంటే ఆఖరి పది ఓవర్లే.. ఏ జట్టుకైనా కీలకం. అంతవరకు వికెట్లు కాపాడుకుంటూ ఆడిన వాళ్లు, అక్కడ నుంచే బ్యాట్ ఝులిపిస్తారు. అప్పుడు పిలక పట్టుకుంటే పనైపోతుంది.
ఇదండీ సంగతి.. ఈ పాంచ్ పటాకా చూశారు కదా..ఇలా ఆడితే తిరుగుండదని సీనియర్లు చెబుతున్నారు.
.
.
.
Poonam Kaur: నాదీ తెలంగాణనే.. ప్లీజ్ వెలివేయకండి.. కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్